పదేండ్లలో 700 పరీక్షలు రాసింది!


Wed,May 22, 2019 12:40 AM

కండ్లు లేకపోవడంతో వారిది పరీక్ష రాయలేని పరిస్థితి. ఇలాంటి వారు పరీక్షలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో వారి పరీక్షలను రాస్తున్నది ఈవిడ. ఇప్పటికి 700 మంది పరీక్షలు రాసింది.
pushpa-preeya
బెంగళూరుకు చెందిన పుష్ప ప్రియ అందరూ చదువుకుంటే దేశం బాగుపడుతుందని నమ్ముతుంది. రోడ్డు దాటించమని అంధులు అడుగుతుంటే అది చూసి ఆందోళనకు గురయ్యేది. అందరూ చదువుకోవాలంటే కండ్లు ఉండాలి. ఎంత చదివినా పరీక్షలు రాయకుంటే వృథానే. ప్రియ, ఆమె సోదరుడు కళ్లులేని వారు పరీక్షలు రాయాలంటే ఏం చేయాలని ఆరా తీశారు. దీనికి ఒకటే పరిష్కారం కళ్లు ఉన్నవాళ్లు వారికి సాయం చేస్తే అందరిలా పరీక్షలు రాసి ఉత్తీర్ణులవుతారు. ఎవరో చేస్తే బాగుందనుకోవడం ఎందుకు. ఆ పని నేనే చేస్తే మరింత సంతృత్తి దొరుకుతుందనుకుంది. ప్రియా నివసిస్తున్న ప్రదేశానికి దగ్గర్లో సమర్థన అనే ఓ సంస్థలో అంధులు, వికలాంగులు ఉంటారు. ప్రియా ప్రతిరోజూ అక్కడికి వెళ్లి పరిచయం పెంచుకొని వారికి దగ్గరైంది. వారి అంగీకారంతో పరీక్షలు రాయడానికి సిద్ధమైంది. పదేండ్ల క్రితం మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నది. ఇప్పటివరకు 700కు పైగా పరీక్షలు రాసింది. ప్రియా కంప్యూటర్స్‌లో డిప్లొమా చేసింది. ప్రస్తుతం ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నది. ప్రియా గురించి తెలిసిన వారు పరీక్షలు రాయడానికి ఇతర ప్రాంతాల నుంచి ఫోన్ చేసి పిలుస్తున్నారు. దీంతో పాటు యాసిడ్ దాడికి గురైనవారికి సాయం చేసే పలు సంస్థల్లో వలంటీర్‌గానూ పనిచేస్తున్నది ప్రియా.

1607
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles