ఫ్రిజ్‌లో ఏదైనా పెట్టొచ్చా?


Wed,May 22, 2019 12:36 AM

మనం అన్ని రకాల ఆహారపదార్థాలను ఫ్రిజ్‌లో పెడుతుంటాం. కూరగాయలు, పండ్లు ఇలా ఏ ఒక్కదాన్ని వదలకుండా ఫ్రిజ్ ఉంది కదాని పెట్టేస్తుంటాం. అయితే కొన్నింటిని ప్రిజ్‌లో పెట్టకపోవడమే మంచిది. మరి ఏవి ఫ్రిజ్‌లో పెట్టొచ్చు. ఏవి పెట్టకూడదు అంటే..
fridge
-అరటి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు. అన్ని పండ్ల మాదిరిగా అరటి పండ్లను ఫ్రిజ్‌లో పెడితే ఏమీ కాదు. కాకపోతే ఫ్రిజ్‌లో పెట్టిన అరటి పండ్ల రంగు మారుతుందని ఆనారోగ్య సమస్యలేవీ ఎదురుకావని వైద్యులు చెబుతున్నారు.
-ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి మురిగిపోయే అవకాశం ఉంది. వాటిని గాలి ఆడేలా ఆరబోయాలి. అదేవిధంగా దోసకాయలను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అందులో ఉండే నీటి శాతం తగ్గుతుంది. ఆ కారణంగా దోసకాయలు త్వరగా పాడైపోతాయి.
-పుచ్చకాయ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఫ్రిజ్‌లో పెడితే చాలు. కానీ పుచ్చకాయ కట్ చేసిన తర్వాత సగ భాగాన్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రతకు త్వరగా రుచి మారుతుంది. పుచ్చకాయను కట్ చేసిన రోజే తింటే మంచిది.
-ఫ్రై చేసిన ఆహారాలు వెంటనే తినేయాలి. వాటిని ఫ్రిజ్‌లో ఉంచి తినడం వల్ల పొట్ట సమస్యలు వస్తాయి. ఫ్రైడ్ ఫుడ్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచి తిరిగి వేడి చేసి తినడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
-ఫ్రిజ్‌లో ఆకుకూరలు పెట్టేటప్పుడు ఆకు కూరలు తడిగా లేకుండా చూసుకోవాలి. తడిగా ఉంటే త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. నాడలు కత్తిరించి మిగతా వాటిని కవర్లలో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది.

2741
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles