వ్యాయామం చేయకపోవడమే కారణం..


Wed,May 22, 2019 12:35 AM

ఇటీవలి కాలంలో చాలా మంది మహిళలు వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది.
heart
శరీరానికి సరైన శ్రమ లేనప్పుడు మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతాయి. అమెరికాలో కార్డియో వాస్క్యూలర్ అనే వ్యాధికి గురవుతున్న మహిళల సంఖ్య పెరుగుతున్నదని అమెరికన్ హార్ట్ అసోషియేషన్ పేర్కొంది. ఇటీవల ఆ సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం.. అక్కడ ఏటా నాలుగు లక్షల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు. అంతే సంఖ్యలో కాన్సర్, శ్వాస సంబంధిత వ్యాధులు, డయాబెటీస్‌తో మరణిస్తున్నారు. ప్రధానంగా కార్డియోవాస్క్యూలర్ వ్యాధికి కారణం సరైన వ్యాయామం లేకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడమే అని ఆ ఆధ్యయనం తెలుపుతున్నది. అలాగే వారానికి కనీసం 150 నిమిషాలైన సాధారణ వ్యాయామం ఉండాలనీ, 30 నుంచి 75 నిమిషాల పాటు తీవ్రమైన వ్యాయామం ఉండాలని అసోషియేషన్ గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. సరైన శారీరక శ్రమ, డాక్టర్ల సలహాలు ఉంటే ఈ కార్డియోవాస్క్యూలర్‌తో పాటు ఇతర వ్యాధులకు దూరంగా ఉండొచ్చని పేర్కొన్నది.

1097
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles