కలలు నెరవేర్చుకొనేందుకు వయసుతో పనిలేదు


Wed,May 22, 2019 12:33 AM

ఆమె అందరిలా చిన్న వయసులోనే కలలు కన్నది. కానీ, డబ్బులు లేకపోవడంతో ఆవి కలలుగానే మిగిలాయి. చివరి దశలో ఉన్నా ఆమె ప్రయత్నాలు ఆపలేదు. చివరికి అనుకున్నది సాధించి ఆనందాన్ని పొందుతున్నది..
beats
జర్మనీకి చెందిన బీట్స్ హౌవిత్‌కు ఎనభై ఏండ్లు! ఇప్పుడు ఆమె జర్మనీలో మంచి డిమాండ్ ఉన్న మోడల్. అదెలా అనుకుంటున్నారా? బీట్స్ చిన్ననాటి కల మోడలింగ్‌లో రాణించడం. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల ఆమె టీచర్ ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అరవై ఏండ్లకు ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయింది. తర్వాత ఖాళీగా ఉండడం ఇష్టం లేక జర్మనీలోని మోట్ అనే మోడలింగ్ ఏజెన్సీలో చేరింది. అక్కడే శిక్షణ తీసుకుంది. ఒక రోజు బియాంక ఎల్గర్ అనే వెబ్ డిజైనర్ తన వెబ్‌సైట్ కోసం మోడల్‌గా ఉండాలని బీట్స్‌ను కోరాడు. దీనికి అంగీకరించిన ఆమె మొదటి ఫొటో షూట్‌కు హాజరైంది. అక్కడ ఊహించని విధంగా ఫొటో అవుట్‌పుట్ రావడంతో బీట్స్‌కు తెలియకుండా ఆ వెబ్ డిజైనర్ ఆ ఫొటోలను స్థానిక మ్యాగజైన్లకు పంపాడు. పలు మ్యాగజైన్లు కవర్ పేజీలో బీట్స్ ఫొటో ప్రచురించాయి. దీన్ని చూసిన బీట్స్ ఆశ్చర్యానికి గురైంది. ఆమె జర్మనీలో డిమాండ్‌లో ఉన్న ఓల్డేజ్ మోడల్‌గా పాపులర్ అయింది. కలలు నెరవేర్చుకునేందుకు వయసుతో పనిలేదని నిరూపించింది బీట్స్.

1039
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles