అదే సబ్బు వాడుతున్నారా?


Tue,May 21, 2019 01:39 AM

SOAPS
- మనం వాడే సబ్బు ద్వారా కూడా చర్మ వ్యాధులు వస్తాయని చాలామందికి తెలియదు. కొన్ని ఉమ్మడి కుటుంబాల్లో ఒకే సబ్బుని అందరూ వాడుతుంటారు. సబ్బు ద్వారా హానికర క్రిములు చర్మంపైకి చేరుతాయి. ఇవి అలర్జీ ఇతర చర్మ సమస్యలకు దారి తీస్తాయి. విడివిడిగా ఎవరి సబ్బు వారు వాడడం మంచిది.
- స్నానం చేసేటప్పుడు శరీరానికి ఒకటి లేదా రెండుసార్లు సబ్బు రుద్దుకుంటే మంచిది. అంతకంటే ఎక్కువ సార్లు సబ్బు రుద్దితే చర్మం పగిలే అవకాశం ఉన్నది. సబ్బు తయారీలో వాడే రసాయనాల వల్ల చర్మానికి, ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్యులు. కెమికల్ సబ్బుల బదులు ఆర్గానిక్ సబ్బులు వాడడం మంచిది.
- తరచూ సబ్బు రాసుకుని స్నానం చేసే బదులు వారానికి ఒక్కసారైనా శరీరానికి సున్నుపిండి రాసుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలిగిపోయి చర్మంపై పేరుకుపోయిన మురికి తొలిగిపోతుంది. సున్ని పిండిలో కాస్తంత పసుపు వేసుకుని నలుగు పెట్టి స్నానం చేసినా మురికి తొలిగిపోతుంది.
- టోటల్ ఫ్యాటీ మ్యాటర్(టీఎఫ్‌ఎమ్) సబ్బులో ఎంత ఎక్కువగా ఉంటే ఆ సబ్బు అంతటి నాణ్యమైన గుణాల్ని కలిగి ఉంటున్నట్టు లెక్క. భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) ప్రకారం టీఎఫ్‌ఎమ్ ఎక్కువ శాతం ఉన్న సబ్బు మంచిది. ఈ సారి సబ్బు కొనేముందు టీఎఫ్‌ఎమ్ చెక్ చేసుకుని మరీ తీసుకోండి.
- సబ్బుల్ని మూడు రకాలుగా విభజించారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. 76శాతంకు మించి టీఎఫ్‌ఎమ్ ఉన్న సబ్బులు గ్రేడ్ 1 కింద వస్తాయి. 70 - 75 వరకు టీఎఫ్‌ఎం ఉంటే అవి గ్రేడ్ 2 సబ్బులు. 60 నుంచి 70 మధ్యలో ఉంటే అవి గ్రేడ్ 3 సబ్బుల కిందికి వస్తాయి. నురగ ఎక్కువ వచ్చినా వాటిని నాసిరకం సబ్బులుగానే పరిగణించాలి. ఎవరైనా గ్రేడ్ 1 వాడడం మంచిది.

532
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles