విదేశాల్లో ఉద్యోగం వదిలి..


Tue,May 21, 2019 01:37 AM

Farmer
లక్షలు కురిపించే విదేశీ ఉద్యోగాన్ని కాదనుకొని ఆమె ఆర్గానిక్ బాట పట్టింది. బాటియా.. ముంబై శివారులో పదెకరాల్లో ఆర్గానిక్ ఫుడ్ ఫారెస్ట్‌ను ఏర్పాటు చేసింది.

బాటియా ముంబైకి చెందిన మహిళ. అమెరికాలోని బోస్టన్‌లో వాతావరణ పరిరక్షణ ఏజెన్సీలో ఎనలిస్ట్‌గా ఉద్యోగం చేసింది. ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు వాతావరణంలో మార్పులకు అసలైన కారణం ఏంటో తెలుసుకోగలిగింది. వాతావరణాన్ని రక్షించడానికి ఇప్పుడు వెతుకుతున్న మార్గాలు అన్నీ తాత్కాలికంగానే ఉపయోగపడతాయనీ, ఈ సమస్యలను మూలాల్లోకి వెళ్లి పరిష్కరించాలని అనుకున్నది. ఉద్యోగం వదిలి ముంబై చేరుకుంది. ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నది. ముంబై నుంచి సుమారు మూడు గంటల ప్రయాణ దూరంలో ఓ వ్యవసాయ భూమిని చూసింది. దాదాపు పదెకరాల స్థలం అది. కొబ్బరి, మామిడి పంట పండించేవారు అక్కడ. దాన్ని కొనుగోలు చేసింది. బృందావన్ అని ఆ వ్యవసాయ భూమికి పేరు పెట్టింది. మామిడి, కొబ్బరితో పాటు మరిన్ని రకాల పంటలను సాగు చేయడం ప్రారంభించింది. తొమ్మిది మంది స్థానిక గ్రామస్థులను వ్యవసాయం చేయడానికి నియమించుకుంది. వారితో పాటు బాటియా కూడా పనుల్లో పాల్గొంటుంది. ఇప్పటికి పదేండ్లు గడిచాయి. ఇప్పుడు బృందావన్‌లో 500 రకాల చెట్లను, ఆహార ఉత్పత్తులను పండిస్తున్నది. ఏటా మామిడి సీజన్‌లో ఐదువేల కిలోల మామిడిని ఉత్పత్తి చేస్తున్నది. ముంబై, ఢిల్లీ, బెంగళూర్ వ్యాప్తంగా ఆమె ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నది. ఇలా బాటియా ఆర్గానిక్ వ్యవసాయం ప్రారంభించి పర్యావరణాన్ని పరిరక్షించడంలో ఆర్గానిక్ వ్యవసాయమే ముఖ్యమార్గం అని అంటున్నది.

245
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles