నడకతో ఆయుష్షు


Tue,May 21, 2019 01:35 AM

నడిస్తే ఆరోగ్యం బాగుంటుంది. అనవసర కొవ్వు కరుగుతుంది. గుండెకూ మంచిదే. ఇంతేనా? నడకలో వేగం పెంచితే అంతకంటే ఎక్కువ ప్రయోజనాలున్నాయని అంటున్నారు లండన్ శాస్త్రవేత్తలు.
marche-rapide
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ (ఎన్‌ఐహెచ్‌ఆర్) బృందం తాజాగా ఒక అధ్యయనం చేపట్టింది. దీంట్లో భాగంగా 4,74,919 మందిని పరిశీలించారు. సాధారణ నడకకన్నా కాస్త వేగం పెంచితే బీఎంఐలో మంచి మార్పు వస్తుందట. అసలు నడకే చేయనివారు ఎన్నో రోగాలను కొని తెచ్చుకోవడంతో పాటు గుండె సమస్యలను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణ నడక వల్ల మహిళలు 64.8 సంవత్సరాలు, పురుషులు 72.4 సంవత్సరాలు మాత్రమే బతుకుతారని.. అదే వేగంగా నడిచేవాళ్లు అయితే ఎనభై సంవత్సరాలకు పైనే బతుకుతారని వారు చెప్పారు. కాబట్టి ఆరోగ్యవంతమైన జీవితం కోసం నడక క్రమం తప్పకుండా చేయాల్సిందే అని సూచిస్తున్నారు పరిశోధకులు. నడిచినంత సేపు ఆయాసం వస్తుండొచ్చుగానీ.. అది జీవితానికి సరిపడే ఆయుష్షును పెంచుతుందనే విషయం గుర్తించుకోవాలంటున్నారు.

118
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles