గింజలు తింటున్నారా?


Tue,May 21, 2019 01:35 AM

నట్స్.. అందరికీ ఇష్టమే. పైగా ఆరోగ్యం అని డాక్టర్లు చెప్తుంటారు. డైటింగ్ కచ్చితంగా పాటించేవాళ్లు తీసుకునే నట్స్ తప్పకుండా ఉంటాయి. కొందరైతే ఎక్కడికి వెళ్లినా నట్స్‌ను వెంట తీసుకొనే వెళ్తుంటారు. కానీ నట్స్‌తో మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి.
Nut-Consum
నట్స్ ఆరోగ్యాన్నిస్తాయి కాబట్టి మనం రెగ్యులర్‌గా తింటుంటాం. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోతే వీటివల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే షుగర్ ఉన్నవారు వీటిని ఎక్కువగా తింటే బ్లడ్‌షుగర్ అధిక స్థాయికి పెరిగిపోయి ప్రమాదకరంగా మారుతుంది. నట్స్‌లో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు అధికశాతం ఉంటాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు అంత మంచిది కాకపోయి ఉండొచ్చు. దీర్ఘకాలికంగా వీటిని ఇలాగే కొనసాగిస్తే కార్డియోమెటబాలిక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. 1387 మందిపై ఇన్‌ఫాహన్ కోహొర్ట్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

123
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles