డెమెన్షియాకు చెక్ పెట్టండిలా


Tue,May 21, 2019 01:35 AM

వయసు పైబడినవారిని వేధించే సమస్య డెమెన్షియా. ఈ సమస్య వల్ల సరిగ్గా ఆలోచించరు. తమ భావాలను వ్యక్తీకరించలేరు. గతంలో ఎంతో తెలివిమంతులైనప్పటికీ దాని తాలుకూ జ్ఞాపకాలేవీ గుర్తుపెట్టుకోలేరు. ప్రతీ గంట వారికి కొత్తగానే ఉంటుంది.
Dementia
డెమెన్షియా వ్యాధిగ్రస్తులకు ఎన్ని చికిత్సలు చేయించినా ఫలితం ఉండదు. జీవితంలో అదొక వింత స్టేజీ. అలాంటి వారిపై ఆశలు వదులుకుంటారు చాలామంది. కానీ సరైన జీవనశైలి అలవరిస్తే వారిలో కూడా మంచి మార్పులు తీసుకురావచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ) బృందం దీనిపై సుదీర్ఘ అధ్యయనం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రజలు డెమెన్షియాతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఏమీ చేయలేం అని వీరిని అలాగే వదిలేస్తే బ్రెయిన్ ట్యూమర్లకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. అలా చేయకుండా వారితో రెగ్యులర్‌గా వ్యాయామం చేయిస్తుండాలి. హెల్దీ డైట్ ఇస్తుండాలి. ఏకాకిని చేసినట్లుగా కాకుండా వారితో అందరూ కలిసిమెలిసి ఉండాలి. పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తుండాలి అని వారు సూచిస్తున్నారు.

117
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles