షుగర్‌తో కాలేయానికి ముప్పు


Tue,May 21, 2019 01:35 AM

షుగర్ వ్యాధి అనేక సమస్యలకు కారణమవుతుందని మనకు తెలిసిందే. అయితే శరీరంలోని అతి ముఖ్యమైన కాలేయానికి కూడా షుగర్‌తో ముప్పు ఉందంటున్నారు నిపుణులు. షుగర్ తీవ్రంగా ఉంటే లివర్ ఫెయిల్యూర్ అయ్యి మనిషి చనిపోయే ప్రమాదం ఉందంటున్నారు.
Diabetes
నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ) డయాబెటీస్ టైప్-2, ఒబెసిటీతో సంబంధం కలిగి ఉంటుంది. అస్తమానం కూర్చుని ఉండి పనిచేయడం.. పౌష్టికాహారం తీసుకోకపోవడం.. క్రమం తప్పిన జీవనశైలి వల్ల డయాబెటీస్ వస్తుంది. దీనికి ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ జతకట్టడంతో కాలేయంకు నష్టం జరుగుతుంది. తీవ్రత పెరగడంతో లివర్ ఫెయిల్యూర్ అవుతుంది. క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు తెలిశాయి. 18 మిలియన్ల మందిని ఈ సర్వేలో భాగంగా పరిశీలించారు. తాము పరిశీలించిన వారిలో ఎక్కువగా షుగర్ వ్యాధిగ్రస్తులే ఉండటం.. వారిలో ఎక్కువ శాతం లివర్ సమస్యలు ఉండటాన్ని పరిశోధకులు గ్రహించారు.

118
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles