వ్యాయామం తప్పనిసరా?


Tue,May 21, 2019 01:33 AM

walking
కొందరు వ్యాయామం చేస్తున్నాం కదాని ఏది పడితే అది తింటూ ఉంటారు. ఎంతసేపు వ్యాయామం చేయాలో తెలియక అధిక క్యాలరీలు వృథా చేసుకుంటారు. వ్యాయామం అనంతరం ఆహారం ఏం తీసుకోవాలో సరిగ్గా తెలియని వారు కొందరుంటారు.. వారి కోసమే ఈ చిట్కాలు.

- వ్యాయామం ఎవ్వరైనా చేయవచ్చు. వ్యాయామం అనేది కేవలం లావు తగ్గడానికి మాత్రమే కాదు. శరీరం బలంగా ఉండడానికి, అలాగే ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు అవసరం. కండరాలు బలంగా ఉండడానికి సైక్లింగ్, శరీరాన్ని సౌకర్యవంతంగా కదిలించేందుకు యోగా బెస్ట్ అంటారు.
- కొందరు ప్రత్యేకంగా బరువు తగ్గడానికి మాత్రమే వ్యాయామం చేస్తుంటారు. ఇంకా కొంత మంది వ్యాయామం చేస్తున్నాం కదాని ఫాస్ట్ ఫుడ్స్, రోడ్‌సైడ్ ఫుడ్ తినేస్తుంటారు. కానీ ఇలా చేస్తే బరువు తగ్గరు సరికదా మరింత బరువు పెరుగుతుంటారు. జంక్‌ఫుడ్ జోలికి వెళ్లకపోవడం మంచిది.
- ఎండాకాలం ఎక్కువగా చెమటలు పడుతాయి. ముఖ్యంగా ఎండా కాలం అధిక వ్యాయామం మంచిది కాదు. చెమటరూపంలో నీరు ఎక్కువగా బయటికి పోయినప్పుడు నీరసం వస్తుంది. అందువల్ల అతిగా వ్యాయామం చేయకూడదు. సీజన్‌తో సంబంధం లేకుండా వ్యాయామం చేయవచ్చు కానీ ఎండాకాలం శరీరంలోని నీరు ఎక్కువగా చెమట రూపంలో బయటికివెళ్తుంది. అందుకని ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. మజ్జిగ, నిమ్మరసం, చెరుకు రసం, పెరుగు వంటివి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.
- వ్యాయామం తర్వాత కండరాలకు విశ్రాంతి అవసరం. అలాంటప్పుడు శరీరానికి అమినో ఆమ్లాలు అందితే కండరాలు ఉత్తేజితమవుతాయి. గుడ్డులో ఈ ఆమ్లాలు ఎక్కువగా లభిస్తాయి. ఉడికించిన గుడ్డు మీద మిరియాల పొడి చల్లుకుని తింటే మంచిది. తృణధాన్యాలు తీసుకుంటే ఒంటికి మంచిది.

205
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles