చేతులు లేకపోతేనేం!


Tue,May 21, 2019 01:31 AM

Jessica-Cox
కాళ్లు, చేతులు అన్నీ బాగుండి డ్రైవింగ్ నేర్చుకోమంటే అమ్మో యాక్సిడెంట్ అయితే అని తప్పుకునే వాళ్లున్నారు. మరి చేతులు లేకుండా డ్రైవింగ్ చేయమంటే.. డ్రైవింగే కాదు ఏకంగా విమానమే నడిపేస్తానంటున్నది. పైలట్ లైసెన్స్ కూడా పొందింది ఈ మహిళ.

అమెరికాలోని ఆరిజొనాకు చెందిన జెస్సికా కాక్స్ చేతుల్లేకుండా జన్మించింది. తల్లిప్రేమ జెస్సికాకు చేతుల్లేవన్న ఆలోచన రానివ్వలేదు. తల్లే దగ్గరుండి.. చదువు నేర్పింది. దీంతో పాటు జెస్సికాకు పియానో, సర్ఫింగ్, కార్ డ్రైవింగ్ నేర్పించింది. ఇవి ఎవరైనా చేయగలరనుకున్నదో ఏమో ఏకంగా పైలట్ కావాలనుకుంది ఆ తల్లి. జెస్సికాకూ పైలట్ కావాలనే ఆసక్తి ఎక్కువ. తల్లి సాయంతో పైలట్ ట్రైనింగ్‌కు సిద్ధం అయింది. చదువు పూర్తవ్వగానే శిక్షణలో చేరింది. కుడికాలు యోక్ మీద, ఎడమకాలు థోరెటల్ మీద పెట్టి రెండు చేతులు మాదిరిగానే ప్రాక్టీస్ చేసింది. ఇలా మూడేండ్లు పైలట్‌కు కావాల్సిన అర్హత సంపాదించుకున్నది. అన్ని విధాల పైలెట్‌గా సరిపోతుందని కోచ్ నిర్ధారించాడు. ఈ యేడాది ఎర్‌కోప్‌లో విమానం నడిపేందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చింది. లైసెన్స్ కోసం చేసిన ఇంటర్వ్యూలో జెస్సికాని చాలా ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ తగిన సమాధానాలు చెప్పడంతో పాటు విమానం ఎక్కే ప్రయాణీకులు పైలట్‌ను చూసి గర్వపడాలి అని ధైర్యంగా చెప్పింది. ఆమె ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతిభకు పైలట్ లైసెన్స్ ఇచ్చారు. త్వరలో పైలెట్‌గా విధులు నిర్వహించనున్న జెస్సికా ఎందరికో రోల్ మోడల్‌గా మారింది.

184
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles