ఆటుపోటులను దాటి..


Tue,May 21, 2019 01:29 AM

ips-ilma-afroze
సమాజంలో వివక్ష కారణంగా నేడు ఎంతోమంది మహిళలు తమ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు. ఆడపిల్లలకు చదువెందుకంటూ, యుక్తవయసు రాగానే పెండ్లి చేసి చేతులు దులిపేసుకుంటున్నారు కొందరు. జీవితంలో ఎదురైన ఆటుపోటులను తట్టుకొని తన గమ్యాన్ని చేరుకొని అందరికీ ఆదర్శమయింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఇల్మా అఫ్రోజ్ కథ అందరికీ ఆదర్శమయింది. బాల్యం నుంచి ఆమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని నిలబడగలిగింది. ఆమెకు పద్నాలుగేండ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి క్యాన్సర్‌తో చనిపోయాడు. తర్వాత బంధువులు, ఇరుగుపొరుగు వారు ఆమెకు పెండ్లి చేసి అత్తగారింటికి పంపించాలనే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె అందరి సూటీపోటీ మాటలను తట్టుకొని ఎంతో శ్రమించి తన లక్ష్యం వైపు అడుగులు వేసింది. తన కూతురి లక్ష్య సాధన కోసం తల్లి సహకరించడంతో ఇల్మా అఫ్రోజ్ కలను నెరవేర్చుకునేందుకు అవకాశం లభించింది. స్కాలర్‌షిప్ ద్వారా ఢిల్లీ, ప్యారిస్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో చదువు పూర్తి చేసింది. తరువాత సివిల్స్ రాసి మంచి ర్యాంకు సాధించింది. సమాజంలో తన లాంటి వాళ్లకు అండగా నిలవాలన్న సంకల్పమే ఇల్మా అఫ్రోజ్‌ను ఐపీఎస్ చేసింది. భారతరాజ్యాంగంలో చట్ట ప్రకారం ప్రతి పౌరుడికీ సమాన హక్కులు, న్యాయం, స్వేచ్ఛ ఉన్నాయి. అసమానత్వం వల్ల ఎంతోమంది మహిళలు ఇంకా ఇంటికే పరిమితమవుతున్నారు. సమసమాజ స్థాపన కోసం ఆహర్నిశలూ శ్రమిస్తానంటున్నది ఇల్మా అఫ్రోజ్. అప్పుడు ఆమెను అవమానించిన వారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు.

146
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles