వైకల్యం అడ్డు కాలేదు!


Sun,May 19, 2019 12:47 AM

అన్నీ బాగున్నాయి అనుకునేలోపు సమస్యలు వచ్చిపడుతాయి. దురదృష్టం కొద్ది సమస్యలన్నీ ఒకే ఇంట్లో ఎదురైతే. తల్లీకూతుళ్ల్లకి అంగవైకల్యం పరిచయం అయితే.. వీటన్నింటినీ పక్కన పెడితే పారా అథ్లెట్‌లో 11 మెడల్స్ సాధించింది.
malik
దేవికా మాలిక్ చిన్నతనంలో రోడ్డుపై సైకిల్ మీద వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ చిన్నదే అయినా గాయాలు మాత్రం పెద్దవి. మెదడుకు దెబ్బతగలడంతో పాటు శరీరంలోని ఎడమ భాగం పక్షవాతానికి గురైంది. స్కూల్‌కి వెళ్తే దేవికాను హేళన చేసేవారే గాని మంచితనంతో మాట్లాడేవారు లేరు. మాలిక్ బాధ చూడలేక తల్లి దీపా మాలిక్ స్కూల్‌లోని పిల్లలు, టీచర్లతో మాట్లాడి సర్థిచెబుతుంది. దేవికా తండ్రి ఆర్మీలో పనిచేయడం వల్ల రెండేండ్లకి మరో ప్రదేశానికి ట్రాన్స్‌ఫర్ అవుతుండడంతో చాలా స్కూళ్లలో దేవికా విద్యనభ్యసించింది. అన్నిచోట్ల మంచి ఫ్రెండ్స్‌ను పొందగలిగింది. 28 యేండ్ల తర్వాత దేవికా అంతర్జాతీయ పారా అథ్లెట్‌గా ప్రపంచంలో వైకల్యంతో బాధపడుతున్న వారందరికీ అండగా, న్యాయవాధిగా వ్యవహరిస్తున్నది. దీనికి గాను 2015లో యంగ్ లీడర్ అవార్డు కూడా అందుకుంది. 2011 నుంచి 2016 వరకు 8 జాతీయ స్థాయిలో, 3 అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ అందుకుంది. లాంగ్ జంప్‌లో సిల్వర్ మెడల్ అందుకుంది. అంగవైకల్యంతో లాంగ్‌జంప్ చేయడం చాలా కష్టం. దీంట్లో మెడల్ అందుకోవడం జీవితంలో మర్చిపోలేనని చెబుతుంది దేవికా మాలిక్. దేవికా 8 యేండ్ల వయసులో తల్లికి వెన్నెముక ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత ఛాతీ భాగం పక్షవాతానికి గురైంది. ఆరోగ్యం బాగోకపోయినా ఇంటిపనులన్నీ చక్కపెట్టి ఆదర్శ మహిళగా గుర్తింపు పొందింది. ఆపరేషన్‌కు ముందు భారతదేశంలోనే మొట్టమొదటి మహిళగా పారాలింపిక్ పతకం అందుకుంది దీపా.

200
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles