బైజూస్ యాప్‌లో చదివేస్తున్నారు!


Sun,May 19, 2019 12:38 AM

ఉదయం లేచినప్పట్నుంచి పిల్లలు ఫోన్‌లో గేమ్స్ ఆడుతుంటారు. ఆటలు పక్కనపెట్టి చదువుకోండి అంటే ఫోన్‌లోనే చదువుకుంటున్నాం అంటున్నారు. పుస్తకం లేకుండా ఎలా చదువుతున్నారని అడిగితే అదేదో బైజూస్ యాప్ అట. దాంట్లో ఒకసారి చదివితే సరిపోతుంది. మళ్లీ మళ్లీ చదువనక్కర్లేదు అంటున్నారు పిల్లలు. పిల్లలు చెప్పింది నిజమేనంటూ హీరో మహేశ్‌బాబు కూడా చెబుతున్నాడు. ఈ యాప్ పూర్తి వివరాలేంటంటే..?
Maheshbabu-Byjus
బైజూస్ ఆన్‌లైన్ యాప్ ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతున్నది. ఈ యాప్ ద్వారా విద్యార్థులు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలపై దృష్టి సారించింది. యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్‌బాబును ఎంచుకున్నారు. ఇదొక ఎడ్యుకేట్ యాప్. విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇచ్చే ఎడ్యుకేట్ కంపెనీ బైజూస్. యాప్‌లో రెండు రాష్ర్టాల నుంచి నమోదవుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నది. మహేశ్‌బాబు ప్రచారం చేయడం ద్వారా తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరింత చేరువవుతున్నది. ఈ యాప్‌తో పాటు మరిన్ని యాప్‌ల గురించి తెలుసుకుందాం.

మహేశ్ : రేయ్ రాహుల్ చదువు మానేసి ఆటలేంట్రా వెళ్లి పుస్తకం తీసి చదువు. అన్నయ్యా.. వీడికి చెప్పు అస్తమానం ఆ యాప్‌లో ఆడుతూ కూర్చుంటే సరిపోతుందా? మ్యాథ్స్ అంటే మళ్లీ మళ్లీ ప్రాక్టీస్ చేయాలి కదా?
రాహుల్ : కాదు.. బాబాయ్ బైజూస్ యాప్‌లో అర్థం చేసుకొని చదువుతాను కాబట్టి లెక్కలు చకచకా చేయగలను.
మహేశ్ : ఈ కథలు మీ నాన్న దగ్గర కాదు. రేయ్ అన్నయ్య వీడికి ఆల్‌జీబ్రాలో గట్టి లెక్క ఒకటి ఇవ్వు చెబుతా.
అన్నయ్య : చీర, ప్యాంటు, షర్టు ఇస్త్రీ చేయడానికి రూ.100 ఇచ్చాను. షర్టు ధర కన్నా చీర ధర రెండింతలు ఎక్కువ. ప్యాంటు ఖరీదు చీర ధర కన్నా రూ.20 తక్కువ. అప్పుడు కేవలం చీర మాత్రమే ఇస్త్రీ చేయడానికి ఎంత అవుతుంది?
మహేశ్ : ఆహా.. ఏమి అడిగావు అన్నయ్య? ఇప్పుడు చెప్పరా రాహుల్?
రాహుల్ : 48.
అన్నయ్య : హే.. కరెక్టే.
మహేశ్ : సూపర్ రా.. అన్నయ్యా మన ఫ్యామిలీ మొత్తంలో బ్రిలియంట్ అన్నయ్యా.. అంటూ మహేశ్‌బాబు యాడ్‌లో అదరగొట్టేశాడు.

లెర్నింగ్ యాప్

learning-app
లెర్నింగ్ యాప్ ట్యాగ్ లైన్ ఫాల్ ఇన్ లవ్ విత్ లెర్నింగ్. బైజూస్ యాప్ భవిష్యత్తుకు కొత్త బాట నేర్పుతుంది. పిల్లలకు సాధారణంగా చదువు చెప్తే అంతగా బుర్రకెక్కదు. వారికి కొత్తగా చెప్పాలి. ఆసక్తికరంగా ఉండాలి. అప్పుడే వింటారు. ఆ విధంగానే బైజూస్ యాప్‌ను రూపొందించారు. దీంట్లో పిల్లలు చదివేందుకు మక్కువ చూపుతున్నారు. పరీక్షల కోసం అసలు కాదు. 7-12వ తరగతుల వరకు అన్ని సబ్జెక్టుల చాప్టర్లు ఉంటాయి. ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా వివరించి ఉంటుంది.

డిక్షనరీ డాట్ కమ్

dictionary-app
లెర్నింగ్ యాప్‌కి గూగు ల్ ప్లేలో 4.6 రేటింగ్ ఉంది. దాన్ని దాటిపోయింది డిక్షనరీ డాట్ కమ్. ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉచితంగా ఇంగ్లీష్ డిక్షనరీ అందిస్తుంది. ఇందులో ఇరవై లక్షల పదాలకు నిర్వచనాలు, పర్యాయ పదాలు ఇందులో వర్డ్ ఆఫ్ ద డే, ఆడియో ప్రనౌన్సియేషన్, వాయిస్ సెర్చ్, ఆర్టికల్స్, ైస్లెడ్‌షోస్, ఫేవరిట్ వర్డ్స్, సెర్చ్ హిస్టరీ, వర్డ్ ఆరిజిన్, లోకల్ లుకప్స్, స్పెల్లింగ్ సజెషన్స్, అడ్వాన్స్‌డ్ లెర్నర్స్ డిక్షనరీ ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. దీంతో ఏ విషయం గురించైనా వెంటనే తెలుసుకోవచ్చన్నమాట.

లుమోసిటీ - బ్రెయిన్ ట్రైనింగ్

lumosity-brain-games
దీన్ని క్రియేట్ చేసింది లుమాస్ లాబ్స్. లుమోసిటీ బ్రెయిన్ ట్రైనింగ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నది. ఎడ్యుకేషన్ యాప్‌ల్లో ఇదే టాప్. కాంప్రెహెన్సివ్ బ్రైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌తో పాటు 30కి పైగా బ్రెయిన్ గేమ్స్ ఉంటాయి. మెమరీ పవర్, ఏకాగ్రతకు పరిక్ష పెడుతుంది. ఒకరోజు చదివి వదిలేయకుండా ప్రతిరోజూ అలవాటుగా చదివేలా విద్యార్థుల్ని మార్చేస్తుంది. దీంతో పిల్లల్లో ఆలోచనా విధానం మారుతుంది.

టెడ్

TED
బైజూస్ మాదిరిగానే ఇది మరొక అప్లికేషన్. ఇది కూడా గూగుల్ ప్లేలో దొరుకుతుంది. దీన్ని టెడ్ కాన్ఫరెన్స్ ఎల్‌ఎల్‌సీ క్రియేట్ చేసింది. టెడ్‌ఎక్స్‌లో వచ్చే వీడియోలు చాలా ఆదర్శంగా ఉంటాయి. అందరికీ అర్థం అయ్యేలా సబ్‌టైటిల్స్ వంద భాషలకు పైగా వేస్తారు. వీడియో చూడలేని వారు ఆడియో వినే సౌకర్యం ఉంది. రకరకాల టాపిక్‌ల మీద భయపడకుండా స్పీచ్ ఇవ్వడానికి ఇదొక మంచి వేదిక. ఒకసారి చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉంది. టెడ్‌ఎక్స్ అందరిలో స్ఫూర్తి నింపుతున్నది. టెడ్‌కు గూగుల్ ప్లేలో 4.6 వరకు రేటింగ్ ఉన్నది.

పిల్లల్ని ప్రోత్సహించాలి

పిల్లలకు చదువుతో పాటు అన్ని విద్యలూ నేర్పించాలి. వారు వేటిలో రాణిస్తారో ఎవరూ ఊహించలేరు. ఫోన్ పట్టుకు కూర్చుంటే చెడిపోతాడు. పుస్తకం పట్టుకోగానే బాగా చదివేస్తాడు అనుకోవడం తప్పు. ఫోన్‌లో పిల్లలకు తెలియని విషయాలు క్లుప్తంగా వివరిస్తే వారే అర్థం చేసుకుంటారు. జనరేషన్‌కు తగ్గట్టుగా పిల్లల్ని పెంచితే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓక్కో యాప్‌కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వీటితో పుస్తకాలు కొని చదువకుండానే జ్ఞానం పొందవచ్చు. ఇంకా ఇలాంటి యాప్‌లు మరెన్నో మున్ముందు రాబోతున్నాయి.

మై క్లాస్ షెడ్యూల్

my-class-schedule
క్లాస్ టైమ్‌టేబు ల్ అంటే విద్యార్థులు పేపర్ మీద రాసుకుంటారు. ఇది అలా కాదు. ఎప్పుడు ఏం చేయాలి? అని ఈ అప్లికేషనే గుర్తు చేస్తుంది. దీంట్లో రిమైండర్ పెట్టుకోవచ్చు. ముఖ్యమైన రోజుల్ని సేవ్ చేసి పెట్టుకుంటే ఆ రోజు గుర్తుచేస్తుంది. ఇలా రోజులు మాత్రమే కాదు. పరీక్షలు దగ్గరికి వస్తున్నప్పుడు, పెండింగ్‌లో ఉన్న హోమ్‌వర్క్ చేయమని సమాచారం అందిస్తుంది. గూగుల్ ప్లేలో మై క్లాస్ షెడ్యూల్‌కు 4.1 వరకు రేటింగ్ ఉన్నది.

-వనజ వనిపెంట

193
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles