స్టోరీ టెల్లర్ చిన్నారి


Sun,May 19, 2019 12:32 AM

ముద్దు ముద్దు మాటలు చెప్పే చిన్నారులు అమ్మ ఒడిలో కథలు వినాల్సిన సమయంలోనే అందరికీ స్టోరీలు చెబుతున్నారు. వరల్డ్ స్టోరీటెల్లింగ్ ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచింది హైదరాబాద్‌కు చెందిన ఈ చిన్నారి.
Ananya
అమ్మా ఒక కథ చెప్పు. లేదంటే నేను అన్నం తినను, నిద్రపోను. నువ్వు కథ చెప్తుంటే అన్నం తిని ఎంచక్కా నిద్రపోతాను అంటూ బతిమిలాడి కథలు చెప్పించుకుంటారు పిల్లలు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. అంతా రివర్స్ అయింది. వినాల్సిన వారే కథలు చెబుతున్నారు. వీరి కథలు అందరికీ వినిపిస్తూ వరల్డ్‌కప్‌లు కూడా సాధిస్తున్నారు. 2019 ఏప్రిల్ 12న మలేషియాలోని జీకన్‌హైజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన వరల్డ్ స్టోరీటెల్లింగ్ ఫైనల్ పోటీల్లో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన అనన్య స్టోరీ టెల్లింగ్‌లో విజేతగా నిలిచింది. ఇదే స్కూల్‌కు చెందిన ఎవాంజలీన్ గ్రేస్ అనే మరొక చిన్నారి వరల్డ్ స్టోరీ టెల్లింగ్ ఫైనల్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. 2018 మే నెలలో కౌలాలంపూర్ వేదికగా జరిగిన రైమ్స్ వరల్డ్‌కప్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నది ఎవాంజలీన్. ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 50 మంది పిల్లలు పాల్గొన్నారు. వీరిలో స్టోరీ టెల్లింగ్‌లో వరల్డ్‌కప్‌తో పాటు ప్రశంసా పత్రం, రూ. 30 వేల నగదు బహుమతి అనన్య గెలుచుకుంది.

198
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles