ఫేస్‌ప్యాక్ ఇంట్లోనే !


Sat,May 18, 2019 12:41 AM

ముడతలతో మృదుత్వాన్ని కోల్పోతున్న చర్మం అందంగా ఉండేందుకు.. సహజసిద్ధంగా లభించే కొన్ని పదార్థాలతో మనం ఇంట్లోనే కొన్ని రకాల ఫేస్‌ప్యాక్‌లను తయారుచేసుకోవచ్చు.
face-pack
- రెండు టీ స్పూన్లు రోజ్ వాటర్‌ని తీసుకుని దానికి అర టీస్పూను తేనె కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది.
-గుడ్డు తెల్లసొన, టీ స్పూను పంచదార కలుపుకొని ఇంచుమించు అయిదు నిమిషాల పాటు మర్ధన చేయాలి. తరువాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి.
-ఒక టీ స్పూను శనగపిండి, రెండు టీ స్పూన్ల వేప చిగురు గుజ్జు, కొద్దిగా పసుపు, అర టీ స్పూను గడ్డ పెరుగు ఒక గిన్నెలో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి ఐప్లె చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి.
-నారింజ, నిమ్మవంటి సిట్రస్ పండ్లలో చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి, ఇ సమృద్ధిగా ఉంటాయి. సిట్రస్ పండ్లు చర్మం మృదుత్వాన్ని పెంచుతాయి. ఈ పండ్ల గుజ్జుతో పాటు తొక్కలు కూడా సమానంగా ఉపయోగపడతాయి.
-అవిసె గింజల ఆయిల్ నుదుటిపైన ముడతల కోసం ఉత్తమ తాత్కాలిక మార్గం. మీరు క్రమం తప్పకుండా పదిహేను రోజుల పాటు 2 లేదా 3 స్పూన్ల అవిసె గింజల నూనెను వినియోగిస్తే నుదుటిపై ఏర్పడిన ముడతలు కనుమరుగవుతాయి. అవిసె గింజల ఆయిల్ అందుబాటులో లేకపోతే ఆముదం కూడా ప్రయత్నించవచ్చు.

290
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles