చక్కెర వ్యాధికి కాకరతో చెక్


Sat,May 18, 2019 12:39 AM

kakara-juice
-కాకరకాయ చక్కెర వ్యాధికి మంచి మందు. కాకరకాయ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. మదుమేహ వ్యాధితో బాధపడుతున్న వారు రోజుకు ఒక సారి కాకరకాయ జ్యూస్ తాగితే మంచిది.
-కాకరకాయ రసంలో శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజలవణాలు, పీచు పదార్థం ఉండడం వల్ల బరువు తగ్గించడంలో కూడా కాకర రసం ప్రధాన పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా రోజుకో టీ గ్లాస్‌లో సగమైనా కాకర జ్యూస్ తాగితే మంచిది.
-కాకర రసాన్ని ఉదయం పూట పరిగడుపున తాగాలి. గ్యాస్ సమస్యతో బాధపడే వారు మధ్యాహ్నం భోజనం తర్వాత తాగితే మంచిది. కాకర రసంలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగ్గా ఉంచుతాయి.
-కాకర జ్యూస్‌లో కొద్దిగా పసుపు, నిమ్మరసం కలుపుకుని తాగితే మరీ మంచిది. గ్లాసు కాకరకాయ జ్యూస్‌లో 11 రకాల క్యాలరీలు, 0.1 గ్రా కొవ్వు, 0.7 గ్రా ప్రొటీన్, 1.7 గ్రాముల పీచుపదార్థం ఉంటాయి.

201
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles