పట్టు మెరుపులు!


Fri,May 17, 2019 02:11 AM

అసలే పెండ్లిండ్ల సీజన్ నడుస్తున్నది.. రోజూ ఒక డ్రెస్‌తో పెండ్లి కూతురే కాదు.. పక్కనున్న పడతులు కూడా మెరిసిపోవాల్సిందే! మెహందీ.. పెండ్లి కూతురిని చేయడం.. ఇలా ఒక్కటేంటి.. ఎన్నో అకేషన్లు ముందున్నాయి.. ఆ సమయంలో పద్ధతిగా తయారైతే..కండ్లన్నీ మీ మీదే ఉండడం ఖాయం.. అందుకోసం ఈ పట్టు కలెక్షన్‌ని తీసుకొచ్చాం..
Fashan
1. పర్పుల్ కలర్ బెనారస్ లెహంగాకి మామిడి పిందెల బార్డర్ మరింత అందాన్ని తెచ్చింది. లెహంగా మొత్తం జరీ బుటీతో నిండిపోయింది. పర్పుల్ కలర్ ప్యూర్ సిల్క్ బ్లౌజ్ నెక్ లైన్, స్లీవ్స్ దగ్గర కుందన్, ముత్యాలతో హెవీగా వర్క్ చేయించాం. నెట్ దుపట్టా మీద కట్ వర్క్‌తో నింపేశాం. డిఫరెంట్ ప్యాటర్న్ కోరుకునేవాళ్లకు ఇది పర్‌ఫెక్ట్ చాయిస్.

2. మామిడి పండు రంగు కంచి పట్టు లంగా ఇది. దీని మీద ఫుల్‌గా జరీ బుటీ వచ్చింది. దీనికి పర్పుల్ కలర్ నెమలి డిజైన్ వచ్చిన బార్డర్ జతకావడంతో సూపర్‌గా కనిపిస్తున్నది. పర్పుల్ కలర్ రాసిల్క్ బ్లౌజ్ మీద హెవీగా సీక్వెన్స్ వర్క్, నాట్ వర్క్‌తో నింపేశాం. పర్పుల్ కలర్ ప్యూర్ జార్జెట్ మీద కూడా ఇదే వర్క్ కంటిన్యూ చేసి, గోల్డెన్ బార్డర్ జతచేయడంతో పర్‌ఫెక్ట్‌గా ఉంది.

3. ఎరుపురంగు కంచి పట్టు లంగా ఇది. పోల్కా డాట్స్‌లాగా లెహంగా మొత్తం హెవీ బుటీ వచ్చింది. దీనికి బ్లూ కలర్ డబుల్ బార్డర్ మరింత లుక్ తీసుకొచ్చింది. లెహంగా ఫ్యాబ్రిక్‌నే బ్లౌజ్‌గా తీసుకున్నాం. దీనికి స్లీవ్స్ దగ్గర కుందన్, నాట్ వర్క్‌తో డిజైన్ చేశాం. బ్లూ కలర్ ప్యూర్ జార్జెట్‌ని ఎంచుకున్నాం. మెరిసిపోతున్న జరీ బార్డర్ దీనికి సరిగ్గా సరిపోయింది.
Fashan1
4. బ్లూ, రెడ్ కలర్స్ కాంబినేషన్ అదిరిపోతుంది. కంచి పట్టు లెహంగా మీద గోల్డ్ జరీ చెక్స్ వచ్చాయి. ఎర్రని త్రిబుల్ బార్డర్ లెహంగాకి అదనపు ఆకర్షణ. ఎర్రని ప్యూర్ జార్జెట్ దుపట్టాకి గోల్డెన్ బార్డర్ జతచేయడంతో పాటు, అక్కడక్కడా కాసు వర్క్ చేయించాం. ఎర్రని ప్యూర్ సిల్క్ బ్లౌజ్‌కి బుట్ట చేతులు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.

5. రాకుమారిలా మెరిసిపోయేందుకు ఈ లంగా-ఓణీ చుట్టాల్సిందే! ప్యూర్ కంచిపట్టు బ్లూ కలర్ లంగా ఇది. దీనికి మొత్తం సిల్వర్ బుటీ వచ్చింది. పింక్ కలర్ పెద్ద బార్డర్ మరింత మెరిసిపోతున్నది. ప్యూర్ పింక్ కలర్ రాసిల్క్ బ్లౌజ్ మీద ఫుల్‌గా జర్దోసీ, గోల్డ్ జరీతో వర్క్ చేయించాం. ఎరుపు రంగు క్రేప్ దుపట్టా మీద ఫుల్‌గా సీక్వెన్స్ వర్క్‌తో నింపేశాం.

-సుప్రజాదేవి చలసాని
-ఫ్యాషన్ డిజైనర్
-మధురాస్ డిజైనర్ స్టూడియో
-ఎస్.ఆర్.నగర్, హైదరాబాద్
-ఫోన్ : 9052903953
https://www.facebook.com/madhurasboutique/

291
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles