అప్పడు గృహిణి.. ఇప్పుడు ఐఏఎస్ !


Wed,May 15, 2019 01:19 AM

మొన్నటి దాకా ఇంటి, వంట పనులు చేసుకునేది. తన ఆరేళ్ల కొడుకు బాధ్యతల్ని చూసేది. ఇన్ని పనుల నడుమ ఒక దృఢమైన సంకల్పం ఆమెను విజయ తీరాలకు చేర్చింది. గృహిణి నుంచి ఐఏఎస్ అధికారి దాకా ఎదిగిన హర్యానాలోని మానేసర్ గ్రామానికి చెందిన పుష్పలత యాదవ్ పరిచయమిది..
ias-pushpalatha
అసలే అది పల్లెటూరు. వసతులు అంతంతమాత్రమే. గృహిణిగా ఇంటి బాధ్యతలు మోస్తూనే కొడుకు బాధ్యతనూ చూస్తున్నది పుష్పలత. కానీ ఇదే జీవితం కాదనుకుందామె. ఎంబీఏ పూర్తి చేసిన పుష్పలత ప్రైవేట్ రంగంలో రెండేండ్లు పనిచేసింది. అంతటితో ఆమె సంతృప్తి చెందలేదు. ప్రైవేట్ ఉద్యోగానికి స్వస్తి చెప్పింది. దృఢసంకల్పంతో మూడేండ్లు రోజుకు 12 గంటల పాటు చదివింది. ఆమె ప్రిపరేషన్ ప్రారంభించిన సమయంలో కుమారుడికి రెండేండ్లు. అయినప్పటికీ కుటుంబీకుల ప్రోత్సాహంతో ఆమె ప్రిపరేషన్‌ను కొనసాగించింది. ఎలాంటి కోచింగ్ లేకుండా ఆమె ఇంటి వద్దే చదవడం మొదలుపెట్టింది. మొదటి ప్రయత్నంలో విఫలమైంది. తన వైఫల్యానికి కారణాలను వెతికి మరింత ఎక్కువ సమయం ఏకాగ్రతతో చదివింది. అనారోగ్య సమస్య వేధించినా రెండోసారి మరింత పట్టుదలతో ప్రయత్నించింది. విజయానికి కొద్ది దూరంలోనే ఆమె ఓటమిని చవిచూసింది. అనంతరం రెండు సార్లు ఓటమి చెందడానికి కారణాలను సమీక్షించుకున్నది. పీడీఎఫ్ పుస్తకాలు చదివింది. మరింత సమాచారం కోసం ఇంటర్నెట్‌ను ఆశ్రయించింది. చివరికి విజయాన్ని ముద్దాడింది. 2017లో యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఆలిండియా 80వ ర్యాంకును సాధించింది. అలా ఆమె మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచింది.
IAS-pushplata

1747
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles