వేళకి భోంచేస్తున్నారా?


Mon,May 13, 2019 11:47 PM

dinner
- క్రమం ప్రకారం భోజనం చేయకపోవడం వల్ల కడుపులో క్రమక్రమంగా గ్యాస్ (అసిడిటీ) సమస్య పెరిగి, శరీరం పటుత్వాన్ని కోల్పోవడం, జీర్ణ వ్యవస్థ పని తీరు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మొదట ఇది చిన్న సమస్యగానే అనిపించినప్పటికీ కొన్ని రోజులకు తీవ్రమై కడుపునొప్పి వేధిస్తుంది.
- వేళకి భోజనం తీసుకోకపోవడం వల్ల అనోరెక్సియా వ్యాధిబారిన పడే ప్రమాదం ఉంది. అనోరెక్సియా వ్యాధి సోకిన వ్యక్తి తన శరీర బరువులో 15 శాతం బరువును కోల్పోవడం జరుగుతుంది. క్రమపద్ధతిలో ఆహారం తీసుకోకపోవడం మహిళల రుతుక్రమానికి సంబంధించి సమస్యల్ని తెచ్చిపెడుతుంది.
- క్రమం తప్పి ఆహారం తీసుకోవడం వల్ల, ఒక్కో పూట ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల బలీమియా, బింగీ వ్యాధులకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధుల వల్ల అధిక శ్రమ కలుగుతున్న భావన, నీరసంగా అనిపించడం, వాంతులు కావడం వంటి పరిణామాలు ఏర్పడతాయి.
- కొందరు యువతీయువకులు నాజూగ్గా కనిపించడానికి కడుపు మాడ్చుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్యాన్ని మూటగట్టుకున్న వారవుతారు. ఎన్ని పనులున్నా సమయానికి భోజనం చేస్తే అనారోగ్య సమస్యలు ఎదురు కావని వైద్యులు చెబుతున్నారు.
- కొందరు అన్నం తినే ముందు తీపి వస్తువులనో చిరుతిళ్లనో తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పూర్తిగా ఆకలి నశించిపోతుంది. అన్నం తినేకంటే అరగంట ముందు నుంచి ఏమీ తినకుండా ఉండడమే మంచిది.

615
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles