కాలేయాన్ని కబలించే.. హెపటైటిస్


Tue,May 14, 2019 01:40 AM

కాలేయం.. మానవ శరీరంలోని కీలక అవయవాల్లో ఒకటి. తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. శరీరంలో నిల్వ ఉండే విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. ఇంతటి మహత్తర శక్తి ఉన్న కాలేయానికి.. వైరస్‌ల నుంచి ముప్పు ఉంది. ఆ వైరస్‌ల దాడి వల్ల వచ్చేవ్యాధి హెపటైటిస్. మనల్ని కాపాడే కాలేయాన్నే కబలించే ఈ వ్యాధి గురించి తెలుసుకొని జాగ్రత్త పడుదాం!
hepatitis-cripto-v2
కాలేయానికి వేగంగా ఇన్ఫెక్షన్ కలుగజేసే వైరస్ ఇది. హెచ్‌ఐవీ కంటే 50-100 రెట్లు ఎక్కువ ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. అయితే ప్రతి పది మందిలో తొమ్మిది మందికి ఆర్నెల్లలో దానంతట అదే తగ్గిపోయే అవకాశం ఉంది. కొద్దిమందిలో అలాగే ఉండిపోయి, దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్‌గా మారి లివర్ దెబ్బతింటుంది. హెపటైటిస్ బి, సి ఈ రెంటికి ఒకే వైరస్ కారణం.

హెపటైటిస్-బి

హెపటైటిస్‌లో మూడు రకాలు ఉంటాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైంది హెపటైటిస్-బి. ఇది రక్తం ద్వారా లేదా లాలాజలం, వీర్యం, యోని స్రావాల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఒంట్లో చేరినా లక్షణాలు త్వరగా కనిపించవు. కొద్దిమందిలో మాత్రం ఫ్లూజ్వరం, అలసట, వికారం, కళ్లు-ఒళ్లు పచ్చబారటం, కడుపునొప్పి, విరేచనాలు, కీళ్ల నొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి.

లక్షణాలు

ఆకలి బాగా తగ్గిపోతుంది. తరుచూ వాంతులవుతాయి. జ్వరం వస్తుంది. వారం తరువాత లక్షణాలు బయటపడుతాయి. కళ్లు, మూత్రం, చెమట పసుపు రంగులోకి మారతాయి. సాధారణంగా ప్రతి మనిషిలో పైత్యరసం 1 నుంచి 1.5 మిల్లీగ్రాములు ఉంటుంది. హెపటైటిస్ ఉన్నవారిలో 30 మిల్లీగ్రాములకు పెరుగుతుంది.

చికిత్స ఏంటి?

హెపటైటిస్ నిర్ధారణ కోసం యాంటిజెన్ పరీక్ష చేస్తారు. వైరస్ ఒంట్లో చేరితే 6-12 వారాల్లోనే ఈ ఫలితం పాజిటివ్ వస్తుంది. లక్షణాలు తీవ్రంగా ఉంటే యాంటీవైరల్ మందులు వాడాలి. పది మందిలో తొమ్మండుగురికి కొద్దిరోజులకు అదే పోతుంది. తర్వాత కూడా దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్‌గా మారితే చికిత్స చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక హెపటైటిస్-బికి పెగ్ ఇంటర్ ఫెరాన్ ఇంజెక్షన్లు లేదా మాత్రలతో చికిత్స అందిస్తారు.

హెపటైటిస్-సి

ఇది హెపటైటిస్-బి మాదిరిగా ఆర్నెల్లలో తొలగిపోయే రకం కాదు. దీని బారిన పడిన ప్రతి ఐదుగురిలో నలుగురికి.. 70-80% ఇది ఒంట్లో ఉండిపోయి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్. దీనివల్ల కొందరిలో ఐదేండ్లకే లివర్ సమస్యలు మొదలైతే మరికొందరిలో సిరోసిస్ వంటి సమస్యలు రావటానికి 20 ఏండ్లకుపైన పట్టవచ్చు. హెపటైటిస్-బి కూడా ఉండటం, మద్యం అలవాటు, ఊబకాయం వ్యాధిని ముదిరేట్టు చేస్తాయి.

లక్షణాలు

దీర్ఘకాలిక హెపటైటిస్-సి ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో మూడో వంతు మంది 10-15 ఏండ్లకు జలోదరం, కామెర్లు, రక్తవాంతులు వస్తాయి. ఇది రక్తం ద్వారానే సంక్రమించే వైరస్. శరీరంలోకి చేరిన తొలిదశలో పెద్దగా లక్షణాలేమీ ఉండకపోవచ్చు. తర్వాత క్రమంగా లక్షణాలు బయటకు కనిపిస్తాయి. హెపటైటిస్-బిలో మాదిరే ఫ్లూజ్వర లక్షణాలు, అలసట, వికారం, కామెర్లు, పసుపు రంగులో మూత్రం, కీళ్లనొప్పులు, ఆందోళన, కడుపునొప్పి, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చికిత్స ఏంటి?

హెపటైటిస్-సి సంక్రమించిందా? అన్నది గుర్తించేందుకు హెచ్ సీవీ యంటీబాడీల పరీక్ష చేస్తారు. ఈ ఫలితం పాజిటివ్ వస్తే ఒంట్లో వైరస్ ఉన్నట్టే లెక్క. వైరస్ మోతాదు తెలుసుకునేందుకు జీహెచ్ సీవీ వైరల్ లోడ్ పరీక్ష చేయిస్తారు. ఈ వైరస్‌లో ఆరు ఉపరకాలు ఉంటాయి. వైరస్ ఉపరకాన్ని బట్టి చికిత్స చెయ్యాల్సి ఉంటుంది. జీనోటైప్-1, 4, 6 రకాల్లో ఏదైనా ఒకటి ఉంటే.. ఏడాది పాటు చికిత్స అవసరం. దీంతో 50-60% మందిలో వైరస్ ఒంట్లోంచి తొలగిపోతుంది. రెండవ, మూడవ ఉపరకాలైతే ఆర్నెల్లే చికిత్స సరిపోతుంది, 75-80% మందిలో పూర్తిగా పోతుంది. చికిత్సలో భాగంగా వారానికి ఒకసారి పెగ్ ఇంటర్ ఫెరాన్ ఇంజెక్షన్, రోజూ రిభావరిన్ మాత్రలు ఇస్తారు. ఈ ఇంజెక్షన్‌తో జ్వరం, నిస్సత్తువ, డిప్రెషన్ వంటి దుష్ప్రభావాలు ఉంటాయి.

జాగ్రత్తలు

రక్తమార్పిడి, కలుషిత ఇంజెక్షన్లు, అపరిచిత లైంగిక సంబంధాలతో ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ప్రసవ సమయంలో తల్లి నుంచి బిడ్డకు సోకుతుంది. కాబట్టి హెపటైటిస్ ఉన్నవాళ్లు రక్తం ఇవ్వొద్దు. ఇచ్చినా సంపూర్ణ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆక్యుపంక్చర్ చికిత్సకు వెళ్లినప్పుడు ఇతరులు వాడిన పరికరాలు, సూదులు మళ్లీ వాడకుండా చూసుకోవాలి. తల్లికి హెపటైటిస్-బి ఉంటే కాన్పు సమయంలో వారికి పుట్టే బిడ్డలకు కూడా సోకచ్చు. పుట్టగానే వీరికి టీకా ఇప్పించాల్సి ఉంటుంది. హెపటైటిస్-బి సంక్రమించకుండా టీకా అందుబాటులో ఉంది. వ్యాక్సినేషన్ మరవొద్దు హెపటైటిస్ వ్యాక్సినేషన్ తీసుకోకుండా విడిచిపెడితే అది లివర్ క్యాన్సర్, లివర్ సిర్రోసిసకు దారి తీస్తుంది.
dr-vidya-sagar

96
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles