సంతానోత్పాదకత ఎందుకు తగ్గుతున్నది?


Tue,May 14, 2019 01:40 AM

కొందరు కావాలని సంతానాన్ని ఆలస్యం చేస్తుంటారు. తర్వాత పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ధోరణే సంతానోత్పత్తి తగ్గుముఖం పట్టడానికి కారణం అంటున్నారు నిపుణులు. ఎంత త్వరగా పిల్లలు కలిగితే జీవితం అంత ఆనందంగా ఉంటుందని వారు చెప్తున్నారు.
Fertility
కెరీర్ పేరు చెప్పి సంతానం గురించి ఆలోచించనివాళ్లు ఎంతోమంది ఉంటారు. వారి దృష్టిలో జీవితంలో అన్ని రకాల ఆనందాలు పొందాలి. అన్నీ అనుభవించాలి. కెరీర్‌లో బాగా రాణించాలి. తర్వాతి తరం కోసం ఎంతో కొంత కూడబెట్టాలి అనేవి ఉంటాయి. కానీ ఈ ఆలస్యం వల్ల సంతానలేమి సమస్య ఏర్పడుతుందంటున్నారు అమెరికన్ సైంటిస్ట్‌లు. దీనికి సంబంధించి తాజాగా అధ్యయనం చేశారు. 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత సంతానం కోసం ఆలోచించడం వృథా ప్రయాసే అని తమ నివేదికలో పేర్కొన్నారు. దీనిని మాట్రియాట్స్ జర్నల్‌లో ప్రచురించారు. దీని ప్రకారం.. మహిళలు 35 సంవత్సరాలు.. పురుషులు 40 సంవత్సరాల వయసు తర్వాత పిల్లల కోసం ప్రయత్నాలు చేయడం మానేయాలి.

పెండ్లి అయిన తర్వాత కూడా ఆలస్యంగా కాపురం పెట్టడం.. కెరీర్ పేరు చెప్పి సంతానాన్ని నియంత్రించడం వల్ల కొన్ని దుష్పరిణామాలు ఎదురై సంతానోత్పాదకతలో మార్పులు ఏర్పడతాయి. ముఖ్యంగా పురుషుల్లో సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గిపోతుంది. సాధారణంగా మహిళలు 40 సంవత్సరాల వరకు ఏ ఆరోగ్య సమస్య లేకుండా ఉంటారు. అది దాటితే ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుంది. ఇక సంతానోత్పత్తి ఎక్కడ సాధ్యం అవుతుంది అని సదరు సైంటిస్టులు అంటారు.

142
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles