అమ్మకు సరికొత్త బహుమతులు!


Sun,May 12, 2019 01:13 AM

pain-bracelet
మాతృదినోత్సవం సందర్భంగా పిల్లలూ మీ అమ్మకి సరికొత్త బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా? ఎలాంటి బహుమతులు ఇస్తే బాగుంటుందో వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకొని తయారు చేసేయండి.

పెయింట్ బీడ్ బ్రేస్‌లెట్

రిబ్బన్, ఉడెన్ బీడ్స్, కాన్వాస్ పేపర్ తీసుకోవాలి. ఉడెన్ బీడ్స్‌కి నచ్చిన విధంగా పెయింట్ వేసుకోవచ్చు. డాట్స్‌తో అలంకరిస్తే అందంగా ఉంటుంది. రిబ్బన్ సహాయంతో ఉడెన్ బీడ్స్ రంధ్రాల ద్వారా ఎక్కించాలి. రెండు చివర్లలో ఊడిపోకుండా ముడి వేయాలి. రిబ్బన్ చివర్లో కాన్వాస్ పేపర్ మీద అమ్మను విష్ చేస్తే నచ్చిన ైస్టెల్‌లో స్కెచ్‌తో రాయండి. పేపర్‌కి రెండు చివరలా రంధ్రాలు వేసి దాంట్లోకి రిబ్బన్ దూర్చాలి. చివరిగా ఊడిపోకుండా ఉండడానికి రిబ్బన్ చివర్ల ముడివేయాలి. సింపుల్‌గా సులభంగా ఉంది కదా.

చేతితో చేసిన పూల బ్యాగు

మాతృదినోత్సవం రోజు అమ్మకు బ్యాగు తయారు చేసి ఇవ్వడం ఒక మంచి బహుమతి. ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్తుంది. దీన్ని కాన్వాస్ మీద పెయింట్‌తో అందంగా డిజైన్ చేయొచ్చు. కాన్వాస్ టోట్ తీసుకొని బ్యాగు ఆకారంలో కుట్టాలి. దీనిపై రకరకాల పెయింట్‌తో చేతి ముద్రలు వేయాలి. ఒకే రకం రంగులు, వేరు వేరు రంగులతో ఫొటోలో మాదిరిగా ప్రయత్నించొచ్చు. బ్యాగును ఎండలో ఆరబెట్టి అమ్మకి ఇస్తే చాలా సంతోషిస్తుంది. ఈ రెండింటిలో మీకు నచ్చింది తయారు చేసి మీ తల్లికి ప్రెజెంట్ చేయండి.
pain-bracelet1

214
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles