వీధుల్లో విద్యా బుద్ధులు!


Sat,May 11, 2019 12:35 AM

కొన్నిసార్లు చదువుకునేందుకు ఆసక్తి ఉన్నవారికి అవకాశాలుండవు. అవకాశాలున్నా కొందరు చదువుకోవడానికి ఆసక్తి చూపరు. అలాంటి వారిని చదువుల వైపు మళ్లిస్తున్నది ఓ స్వచ్ఛంద సంస్థ.
mumbai-study-street
ముంబైలోని వర్ల్లినక అనే ప్రాంతంలో చోర్‌బజార్ ఉన్నది. ఆ బజార్‌లో అన్ని రకాల వస్తువులు అమ్ముతుంటారు. ఈ ప్రాంతంలో నివసించేవారి ఇండ్లు చాలా ఇరుకుగా ఉంటాయి. సరైన విద్యుత్ దీపాలున్నా, చదువుకోవాలంటే అనువైన వాతావరణం లేదు. అక్కడంతా రాత్రి, పగలు అనే తేడాల్లేకుండా ఎప్పుడు చూసినా జనాల హడావుడి ఉంటుంది. అంతేకాదు వాహనాల రణగొణ ధ్వనులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లి పోతుంటుంది. అటువంటి వాతావరణాన్ని సైతం చదువుకునేందుకు అనువుగా మార్చిందిమిసల్ ముంబై అనే స్వచ్ఛంద సంస్థ. అక్కడ నివసించే పిల్లల్లో చదువుపై ఆసక్తి కలిగించడమేకాకుండా ఎంతో మందిని విద్యావంతులుగా తీర్చి దిద్దుతున్నది. సామాజిక కార్యకర్త రౌబల్ నాగి ఈ ఈ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఆమె మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నది. ఆయా ప్రాంతాల్లో ఇండ్లపై సూక్తులను రాస్తూ, అందమైన రంగులతో అక్కడి వాతావరణాన్ని మార్చివేసింది. అక్కడి పిల్లలు చదువుకునేందుకు ప్రత్యేకంగా వీధుల్లో రోడ్డుకు రెండు పక్కలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయించింది. అంతేకాకుండా వారి కోసం ప్రత్యేకంగా ఓ గ్రంథాలయాన్ని నిర్మించింది. అలా ఆయా ప్రాంతంలో నివసించే రెండు తరాలకు చెందిన పిల్లలకు విద్యాగంధాన్ని ప్రసాదిస్తున్నది.

889
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles