పార్టీలకు ప్రత్యేకం!


Fri,May 10, 2019 01:43 AM

ఏ సీజన్‌కి తగ్గట్టు అలా ఉండడమే కాదు... అకేషన్‌కి తగ్గట్టు డ్రెస్సింగ్‌లో కూడా మార్పు కావాలి.. ఈతరం అమ్మాయిలు వీటిని బాగా ఫాలో అవుతున్నారులెండి.. ప్రత్యేకమైన అనార్కలీలు.. లాంగ్‌ఫ్రాక్స్.. పార్టీల్లో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలబెడుతాయి.. అందుకే ఆ ప్రత్యేకమైన కలెక్షన్ ఈ వారం మీకోసం..
Fashan
1. పర్పుల్ కలర్ సాఫ్ట్ నెట్‌ని రెండు లేయర్లుగా డిజైన్ చేశాం. దానికి అదే రంగు రాసిల్క్‌ని బార్డర్‌గా జత చేశాం. పైన కూడా ఇదే సాఫ్ట్ నెట్‌ని ఎంచుకొని హ్యాండ్స్‌కి గోల్డెన్ పైప్స్ అటాచ్ చేశాం. ఇక పైన మొత్తం సీక్వెన్స్, జర్దోసీ, జరీ థ్రెడ్‌లతో హెవీగా వర్క్ చేయడంతో పార్టీ లుక్ వచ్చేసింది.

2. ఎర్రని నెట్ ఫ్యాబ్రిక్‌ని లేయర్లుగా డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. దీని మీద మొత్తం ఎర్రని ముత్యాలు వచ్చాయి. దీనికి పూర్తి కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాం. ఆకుపచ్చని రాసిల్క్ మీద హెవీగా మెషీన్ ఎంబ్రాయిడరీతో నింపేశాం. ఫుల్ స్లీవ్స్‌ని కోల్డ్ షోల్డర్స్‌గా ఇవ్వడం వల్ల మరింత గ్రాండ్ లుక్ వచ్చింది.

3. పింక్ కలర్ రాసిల్క్, ఫాలింగ్ రాసిల్క్ మిక్సింగ్‌లతో లాంగ్ అనార్కలీలా కుట్టాం. స్లీవ్స్ మీద హెవీగా స్టోన్, థ్రెడ్ వర్క్‌తో ఎంబ్రాయిడరీ చేయించాం.
కింద కూడా రాసిల్క్ బార్డర్‌ని జత చేయడంతో మెరిసిపోతున్నది.
Fashan1
4. పార్టీలకు ఈ డ్రెస్ పర్‌ఫెక్ట్. డార్క్ బ్లూ కలర్ సాఫ్ట్ నెట్‌తో ఈ లాంగ్ ఫ్రాక్ కుట్టాం. డ్రెస్ మొత్తం చిన్న చిన్న బంచెస్ ఇచ్చాం. వీటిని మొత్తం సీక్వెన్ ఎంబ్రాయిడరీతో నింపేశాం. ఫుల్ స్లీవ్స్, నెక్ లైన్ దీనికి అదనపు ఆకర్షణ.

5. ఆరెంజ్ కలర్ సాఫ్ట్ నెట్ పార్టీ వేర్ ఫ్రాక్ ఇది. రెండు లేయర్లుగా డిజైన్ చేసి, చివరన గోల్డెన్ బార్డర్ అటాచ్ చేశాం. డ్రెస్ మొత్తం చిన్న స్టోన్స్‌ని అతికించాం. పైన గోల్డెన్ టిష్యూ ఫ్యాబ్రిక్‌ని వాడాం. దీని పైన పింక్ కలర్ నెట్ మీద హెవీగా సీక్వెన్స్‌తో వర్క్ చేసి కేప్‌గా అటాచ్ చేయడంతో మరింత మెరిసిపోతున్నది.

322
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles