ఆమె మహిళల గొంతుక!


Fri,May 10, 2019 01:34 AM

ఈశాన్య రాష్ర్టాల్లో ఆమె ఒక హీరో. ఒక వైపు తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరో వైపు మహిళల గొంతుకై నిలిచింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిర్మూలించేందుకు 1970వ దశకంలోనే కృషి చేసింది. ఓ వైపు పోలీసు అధికారిగా, మరో వైపు తల్లిగా బాధ్యతల్ని మోసింది. ఆమే దివంగత యామిని హజరిక.
YAMINI-HAZARIKA
అసోం మొదటి మహిళా పోలీసు అధికారి యామిని హజరిక. 1979లో డీఏఎన్‌ఐపిఎస్ (ఢిల్లీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ పోలీస్ సర్వీస్)లో ఉద్యోగంలో చేరింది. పంజాబ్ పోలీస్ అకాడమీలో శిక్షణ అనంతరం ఐపీఎస్‌గా ఆమె పదోన్నతి పొందింది. శిక్షణ సమయంలో ఆమెకు రాజీవ్ సాగర్ ఐపీఎస్ అధికారితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహానికి దారి తీసింది. కొన్ని రోజుల తర్వాత సాగర్, యామినికి ఏర్పడిన విభేదాల వల్ల ఇద్దరూ విడిపోయారు. అయినప్పటికీ యామిని పోలీసు అధికారిగా ఓ వైపు విధులు నిర్వహిస్తూనే తన ఇద్దరు పిల్లల్ని పెంచి పోషించింది. ఢిల్లీ పోలీస్ డివిజన్‌లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా ఆమె పనిచేసింది. మహిళల అత్యాచారాల్ని నిరోధించేందుకు, మహిళల హక్కుల కోసం ఆమె కృషి చేసింది. 1997లో ఆమె మహిళా శిరోమణి అవార్డును అందుకున్నది. 1999లో క్యాన్సర్‌తో పోరాడి మరణించింది. దాదాపు రెండు దశాబ్దాలు ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారిగా పనిచేసిన ఆమెను ఢిల్లీ పోలీసులు, స్థానిక ప్రజలు, సంఘాలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాయి.

262
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles