కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా?


Fri,May 10, 2019 01:32 AM

Cood-drinks
-మనం పీల్చే ప్రాణవాయువు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శరీరానికి హాని కలిగించే కార్బన్ డైఆక్సైడ్‌ను బయటకు పంపిస్తుంది. అలాంటి కార్బన్‌డైఆక్సైడ్‌ను కూల్ డ్రింక్స్ ఎక్కువ కాలం నిల్వ ఉంచడం కోసం వాడతారు. అవి తాగడం వల్ల వెంటనే నోటి నుంచి ముక్కులో నుంచి ఆ వాయువు బయటకు వస్తుంది.
-కూల్‌డ్రింక్స్‌లో పాస్పరిక్ యాసిడ్, కార్పోలిక్ యాసిడ్ లాంటివి కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అందువల్లనే కూల్ డ్రింక్స్‌ను తాగిన వెంటనే త్రేన్పులు రావడం, కడుపులో మంట ఎసిడిటీ కలుగుతాయి. పిల్లలకు కూల్‌డ్రింక్స్ తరచూ ఇస్తే అనారోగ్య సమస్యలు రావడం ఖాయం.
-చాలామంది ఇండ్లల్లో ఫ్రిజ్ నీళ్లకు అలవాటు పడి బాగా చల్లగా లేని నీళ్లు తాగలేకపోతుంటారు. ఎంత చల్లగా ఉంటే అంత అనారోగ్యం. కాలమేదైనా కూల్ వాటర్ తాగకపోవడమే మంచిది. వీలైతే కుండ లేదా రంజన్‌లోని నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది.
-రోజూ ఉదయం గోరువెచ్చని నీళ్లు తాగితే తలనొప్పి, మైగ్రేన్, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. అస్తమా, గొంతునొప్పి , కడుపునొప్పి సమస్యలు కూడా తగ్గిపోతాయి. కొలస్ట్రాల్ పెరుగుదల కూడా వేడి నీళ్లతో ఆగిపోతుంది. కన్ను, ముక్కు, చెవి, నోటి సమస్యలన్నింటికీ మందు వేడి నీళ్లు.
-చాలామంది ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు బయట దొరికే డ్రింక్స్, జ్యూస్‌లు తాగుతుంటారు. ఇవి మంచివే అయినప్పటికీ ఇందులో కలిపే ఐస్ మంచిది కాకపోవచ్చు. అందుకని ఐస్ లేకుండా జ్యూస్ తాగితే శరీరానికి విటమిన్లు అందుతాయి.

330
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles