చక్కెర వ్యాధికి మెంతులతో చెక్


Fri,May 10, 2019 01:31 AM

menthulu
-మెంతుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి నుంచి విముక్తి కలిగేలా చేస్తాయి. కడుపునొప్పి ఉన్నప్పుడు కొన్ని మెంతులను నీటిలో నానబెట్టి తీసుకుంటే నొప్పి తగ్గుతుంది. వికారం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
-మెంతులను నూనెలో వేయించుకుని వాటిని మొత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని గ్లాస్ పాలల్లో వేసి స్పూన్ చక్కెర కలిపి తాగితే నీరసం, ఒత్తిడి వంటి సమస్యలు దరిచేరవు. తక్షణ శక్తి కూడా లభిస్తుంది.
-మెంతుల పొడిలో కొద్దిగా నీరు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
-మెంతులు ఇన్సూలిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. డయాబెటిస్ వ్యాధికి మెంతులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. శరీరంలోని చెడు వ్యర్థాలను తొలిగిస్తాయి. నీళ్ల విరేచనాలవుతుంటే.. కొన్ని మెంతి గింజలను తీసుకోవాలి.

325
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles