ఈ ఊరు అమ్మబడును!


Fri,May 3, 2019 01:15 AM

అవును మీరు చదివింది నిజమే. ఆ ఊరిని అమ్మేయాలనుకుంటున్నారట! కారణం ఏదైనా విషయం మాత్రం కొత్తగా, వింతగా ఉంది కదూ! రండి స్టోరీ గురించి తెలుసుకుందాం.
story
అమెరికాలోని ఇండియానాలో ఉన్న ఊరి పేరు స్టోరీ. ఆ ఊర్లో మనుషుల సంఖ్య మూడు. అవును ముగ్గురు మాత్రమే నివసించే ఆ ఊరిని ఇప్పుడు అమ్మేయాలనుకుంటున్నారు. అన్ని సదుపాయాలున్నా.. ఆ ఊర్లో నివసించడానికి వాళ్లు ఇష్టపడడం లేదట. అయితే అమ్మాలనుకుంటున్నారు కాబట్టి చాలామంది కొనడానికి ముందుకొస్తున్నారు. కానీ దాని ఖరీదు ఎంతో తెలుసుకొని షాక్‌కు గురవుతున్నారు. అక్షరాల ఆ ఊరి ధర 26.28 కోట్లు. ఈ గ్రామం చిన్నపాటి ఫిల్మ్‌సిటీని తలపిస్తుంది. 173 ఎకరాల్లో ఉన్న ఈ గ్రామంలో ఒకప్పుడు 175 మంది దాకా నివసించే వారు. రాను రాను ఆ సంఖ్య అంతరించిపోయి మూడుకు చేరింది. ఇక్కడికి పర్యాటకులు కూడా వస్తుంటారు. అక్కడ హోటల్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. 2015 తర్వాత పర్యాటకుల రద్దీ పెరిగింది. అక్కడ ఉన్న పాత భవనాలను కాటేజీలుగా మార్చి పర్యాటకులకు అద్దెకిస్తున్నారు. ఈ నెల 12 నుంచి స్టోరీ ప్రాంతంలో ఇండియానా వైన్ మేళ జరుగనున్నది.
story-2

391
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles