ప్రభుత్వ పాఠశాలకు దక్కిన అరుదైన గౌరవం!


Sun,April 21, 2019 12:33 AM

ఎక్కడ బొల్లారం.. ఎక్కడ అమెరికా.. అక్కడికి వెళ్లాలంటే పెట్టి పుట్టాలంటారు. పెద్దోళ్లు, గొప్పోళ్లే అమెరికాకి వెళ్తారనే మాటలను ఈ విద్యార్థులు మార్చిపారేశారు. తెలంగాణలోని బొల్లారం ప్రభుత్వ పాఠశాలలో చదివే ఏడుగురు విద్యార్థుల్ని ఓ సంస్థ మేలో అంతరిక్ష విజ్ఞాన సదస్సుకి తీసుకెళ్లనున్నది. వీరు అక్కడి శాస్త్రవేత్తలను కలువనున్నారు. ఈ అరుదైన అవకాశం వీరికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే!
Students

సంగారెడ్డి జిల్లా బొల్లారం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు అరుదైన గౌరవం లభించింది. గత ఏడాది డిసెంబర్‌లో అమెరికాకి చెందిన గో ఫర్ గురు అనే సంస్థ జాతీయ స్థాయిలో అంతరిక్షంపై వ్యాస రచన పోటీ నిర్వహించింది. ఈ పోటీలో బొల్లారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రాత పరీక్ష ఇంగ్లీష్‌లో అయినా ఈ విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. 30 మందిలో మొత్తం ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ ఏడుగురిని మే నెలలో అమెరికాకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీరు నాసాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రంలో జరిగే అంతర్జాతీయ అంతరిక్ష విజాన సదస్సులో పాల్గొనున్నారు. అక్కడుండే ప్రముఖ శాస్త్రవేత్తలతో ముచ్చటించనున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకే సాధ్యం కాని అవకాశాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు దక్కించుకోవడం గమనార్హం. అరుదైన గొప్ప అవకాశాన్ని సొంతం చేసుకున్న విద్యార్థులకు అందరూ అభినందనలు తెలుపుతున్నారు. దీంతో గ్రామానికి, పాఠశాలకే కాకుండా విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకూ మంచి పేరు తీసుకొచ్చింది.

అవకాశం వచ్చింది..

గో ఫర్ గురు అనే సంస్థ ఆస్ట్రోనాట్ మెమొరియల్ పౌండేషన్, ఫోరిడా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే సంస్థతో కలిసి 2018 డిసెంబర్‌లో జాతీయ స్థాయిలో పాఠశాల వ్యాస రచన పోటీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విషయం తెలుసుకున్న తెలుగు భాషోపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాస్ రావు విద్యార్థులకు తెలియజేశాడు. వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం అవివేకం. పోటీకి కావాల్సిన విధంగా తీర్చిదిద్దుతా అని విద్యార్థులకు నమ్మకం కలిగించాడు. ఉపాధ్యాయుడు ప్రోత్సాహంతో పోటీలో పాల్గొన్నారు. కల్పనా చావ్లా - మై ఇన్సిపిరేషన్, అబ్దుల్ కలాం - మై హీరో అనే అంశాలను తీసుకొని వ్యాస రచనలు రాశారు. పోటీలో ఎంపికైన ఏడుగురిలో ఆరుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరు పదో తరగతికి చెందిన జి. వెన్నెల, 9వ తరగతికి చెందిన జి. మీనాక్షి, ఎ. నవ్య, జి. అనిత, జి. లావణ్య, బి. గౌతమి, పి. ఫణిధర్. తెలంగాణలోని అన్ని జిల్లాలలో నుంచి ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం విశేషం. మిగిలిన కార్పొరేట్ పాఠశాలలో మొత్తం 50 మంది ఎంపికయ్యారు. వీరంతా మేలో అమెరికాని సందర్శించనున్నారు. మొత్తం ఏడు రోజులు. వీరి బాగోగులు అన్నీ గో ఫర్ గురు సంస్థనే చూసుకుంటుంది.

విద్యార్థుల సత్తా..

ఈ విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ సత్తా చూపుతున్నారు. ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు సాధించలేని ఘనతను వీరు సాధిస్తున్నారు. వీరి ఉత్సాహానికి కాస్త ఉపాధ్యాయుల ప్రోత్సహం తోడైతే ఎదురుండదు. సౌర వ్యవస్థ, గ్రహాల వాతావరణంపై సూర్యుడి ప్రభావం గురించి పార్కర్ సోలార్ ప్రొబ్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అధ్యయనం చేసేందుకు 2018 మేలో నాసా శాటిలైట్‌ను పంపింది. ఈ మిషన్‌లో పిల్లలు ఎవరైనా పాలు పంచుకోవచ్చని అప్పట్లో నాసా ప్రకటించింది. దీనికి హాట్ టికెట్ ప్రోగ్రామ్ అనే పేరు పెట్టారు. ఇందులో పాల్గొనాలంటే ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకోవాలని ప్రకటించింది. దీనికి ధరఖాస్తు చేసుకున్న ఎనిమిది మంది విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు.

వారిని బాగా చూసుకుంటా..


fanider
నా పేరు ఫణిధర్. నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. మా నాన్న సెక్యూరిటీగా పనిచేస్తాడు. మా సొంతూరు వరంగల్ జిల్లా ఐదేండ్ల క్రితం బొల్లారంలో స్థిరపడ్డాం. నాకు ఒక తమ్ముడున్నాడు. నేను బాగా చదువి ఐఐఐటీ చేరాలని ఉంది. మంచి ఉద్యోగం చేసి మా అమ్మానాన్నలని సంతోషంగా చూసుకుంటాను.

దేశం గర్వించేలా..


vennela
నా పేరు వెన్నెల. మా కుంటుం బం బొల్లారంలో స్థిరపడింది. మేము ఇద్దరం అమ్మాయిలం. మా తల్లిదండ్రులు ఇద్దరూ కష్టపడి వచ్చిన డబ్బుతో మమ్మల్ని చదివిస్తున్నారు. చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలిసిన దాన్ని బాగా చదివి పోలీస్ అవుతాను. మా కుటుంబంతో పాటు దేశం గర్వపడేలా ఎదుగుతానంటున్నది వెన్నెల.

..?ఎం. రమేశ్, నమస్తే తెలంగాణ, జిన్నారం

బుక్ బ్యాంక్‌తో చెట్లని కాపాడుదాం!


bookss
పిల్లలందరికీ చదువు అబ్బుతుందో లేదో గానీ యేడాది అవ్వగానే పాత పుస్తకాలు పోయి కొత్తవి మాత్రం తప్పకుండా వస్తాయి. ఈ విధంగా చూస్తే యేడాదికి కొన్ని లక్షల చెట్లని నరికి పుస్తకాలుగా తయారు చేస్తారు. బుక్‌బ్యాంక్‌తో ఇకపై నష్టం జరుగదంటున్నారు.తమిళనాడుకి చెందిన అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఒక ఆదేశమిచ్చింది. అదేంటంటే.. చివరి పరీక్షలు పూర్తికాగానే పాత పుస్తకాలన్నింటినీ ఒక చోటుకి చేర్చమన్నారు. దీనికి బుక్ బ్యాంక్ అని పేరు పెట్టారు. తమిళనాడులోని విద్యార్థులంతా వారి పుస్తకాలను చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. ఫైనల్ పరీక్షలు అవ్వగానే వారే స్వయంగా వచ్చి బుక్ బ్యాంక్‌లో అందజేస్తారు. ఇందులోని పుస్తకాలనే జూనియర్స్‌కి ఇస్తారు.

ఇలా ఒకసారి ప్రింట్ చేసిన పుస్తకాలను చిరిగిపోయేంత వరకు వాడడం వల్ల ప్రింటింగ్ తగ్గుతుంది. ప్రింటింగ్ తగ్గడం వల్ల చెట్లను నరకడం తగ్గుతుంది. ప్రకృతిని మనం ఎంతో కొంత కాపాడినవాళ్లమవుతాం. సుమారుగా.. యేడాదికి 8 లక్షల చెట్లతో 40 వేల టన్నుల కాగితాలు తయారు చేస్తున్నారు. వీటితో ఏడాదికి 8 కోట్ల పుస్తకాలు తయారవుతున్నాయి. కొత్త మొక్కలు నాటి నీరు పోయనవసరం లేదు. ఉన్న వాటినే రక్షించుకుంటే సరిపోతుందంటున్నారు తమిళనాడు ప్రజలు. ఇలానే ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఆదేశాలను జారీ చేసింది. చాలామంది కొత్త పుస్తకాలు కొనలేక స్కూల్‌కి దూరమవుతున్నారు. అలాంటి వారికి బుక్ బ్యాంక్ ఉచితంగా పుస్తకాలు అందిస్తున్నది. ఆయా రాష్ర్టాల్లోనే కాదు.. మనమూ స్వచ్ఛందంగా పుస్తకాలను పాడేయకుండా తర్వాత వచ్చే వాళ్లకు అందించి వృక్షాలను కాపాడుకుందాం.
books

391
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles