స్క్రీనింగ్ అందరికీ అవసరమే!


Mon,June 18, 2018 11:31 PM

క్యాన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత సులువుగా చికిత్స అందించవచ్చు. అయితే క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడానికి మనకు రెండు రకాల కారకాలు అవసరం. అవి క్యాన్సర్ వ్యాధి లక్షణాలు తెలుసుకోవడం, స్క్రీనింగ్.
screening

క్యాన్సర్ వ్యాధి లక్షణాలు

సామాన్య ప్రజలు క్యాన్సర్ ముందస్తు లక్షణాలను గురించిన పరిజ్ఞానం కలిగి ఉండడం వల్ల క్యాన్సర్‌ను త్వరగా గుర్తించడానికి వీలవుతుంది. కణితులు, అసాధారణ రక్తస్రావం, దీర్థకాలం పాటు ఆహారపు అరుగుదల సరిగ్గా లేకపోవడం, మొదలైనవి క్యాన్సర్ ముందుస్తు లక్షణాలతో కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్, నోటి క్యాన్సర్, పెద్ద పేగులలో క్యాన్సర్, చర్మ క్యాన్సర్ వంటి వాటిలో పైన పేర్కొన్న లక్షణాల ద్వారా క్యాన్సర్‌ను ముందుగనే గుర్తించవచ్చు.

స్క్రీనింగ్

స్క్రీనింగ్ అనేది ఆరోగ్యంగా ఉండే వ్యక్తులలో నిగూఢమై ఉన్న క్యాన్సర్‌ను గుర్తించడానికి నిర్వహించే పరీక్ష. క్యాన్సర్ కారకాలు శరీరంలో దాగి ఉండే లక్షణాలు. ఇంకా బయటపడని వ్యక్తులలో నిర్వహించే సాధారణమైన, సులభైమన పరీక్ష. ముందు జాగ్రత్తగా ఈ పరీక్షలను నిర్వహించుకోవడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది.

క్యాన్సర్ ఎవరి రావచ్చు?

-పొగతాగే వారు, పొగాకు నమలటం (గుట్కా, పాన్ మసాల, జర్దా వంటివి)అలవాటు ఉన్నవారు
-మద్యానికి బానిసలైన వారు, సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధులు కలిగిన వారు
-స్థూల కాయం కలిగిన వారు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారు, వ్యాయామం అలవాటు లేనివారు
-పీచు పదార్థాలు తక్కువగా తీసుకోని వారు, మసాలాలు ఎక్కువగా తినేవారు
మహిళలకు ఎలాంటి పరీక్షలు
-బ్రెస్ట్ క్యాన్సర్ - 40 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి తప్పకుండా డిజిటల్ మమ్మోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం మంచిది.
-20-30 సంవత్సరాల మధ్య వయసు వారు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి, డాక్టర్‌ను సంప్రదించాలి. 40 సంవత్సరాలు నిండిన వారు ప్రతి సంవత్సరం పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్‌ను సంప్రదించాలి.
-సర్వైకల్(గర్భాశయ ముఖద్వారం) క్యాన్సర్ - శృంగారంలో పాల్గొనడం మొదలు పెట్టిన 3 సంవత్సరాల తర్వాత నుంచి ప్రతి మహిళ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.
-సాధారణ పీఏపీ పద్ధతిలో అయితే రెండు సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది.
-30 సంవత్సరాలు పైబడిన వయసు కలవారు ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి పీఏపీ పరీక్ష, హెపీవీడీఎన్‌ఏ పరీక్ష చేయించుకుంటే మంచిది.
-కానీ హెచ్‌ఐవి ఉన్నవారు, అవయవ మార్పిడి, కీమోథెరపీ తీసుకునేవారు, మత్తు పదార్థాలకు బానిపలైన వారు రోగ నిరోధక శక్తి తగ్గిపోయిన వారు ప్రతి సంవత్సరం పైన చెప్పిన పరీక్ష చేయించుకోవాలి.
-70 సంవత్సరాలు పైబడిన మహిళలలో గత 10 సంవత్సరాల్లో పీఏపీ పరీక్షలో నార్మల్ ఫలితాలు వచ్చిన వారు స్క్రీనింగ్ పరీక్షలు ఆపేయ్యవచ్చు.
-హిస్టరెక్టమీ ద్వారా గర్భాశయంతో పాటు ముఖద్వారాన్ని కూడా తొలగించిన వారికి కూడా స్క్రీనింగ్ అవసరం లేదు.
-10 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు 46 సంవత్సరాల లోపు మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల 90 శాతం వరకు సర్వైకల్ క్యాన్సర్‌ని నివారించవచ్చు.

పురుషుల స్క్రీనింగ్ పరీక్షలు

ప్రొస్టేట్ క్యాన్సర్ - మగవారికి వచ్చే క్యాన్సర్‌లలో ప్రొస్టేట్ క్యాన్సర్ కూడా ఒకటి. భారతదేశంలో ప్రొస్టేట్ క్యాన్సర్ అసహజమేమీ కాదు. కానీ చాలా మందికి దీని గురించిన అవగాహనల లేదు. అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా మగవారు రెగ్యులర్‌గా ప్రొస్టేట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. 50 సంవత్సరాలు నిండిన మగవారు ప్రతి సంవత్సరం ప్రొస్టేట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ రక్తపరీక్ష, డిజిటల్ రెక్టల్ పరీక్ష చేయించుకోవాలి. దగ్గరి రక్తసంబంధీకుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నవారు 40 సంవత్సరాల వయసు నుంచి ప్రొస్టేట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి.
mohana-vamshi

359
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles