క్యాన్సర్ ఎందుకు వస్తుంది?


Tue,April 3, 2018 01:43 AM

క్యాన్సర్ సోకిన భాగం, అవయవాన్ని బట్టి క్యాన్సర్ రకాన్ని నిర్ణయిస్తారు.
Cancer
-కార్సినోమా - చర్మం మీద, అవయవాల లోపలి లేదా బయట పొరల్లో వచ్చే క్యాన్సర్
-సార్కోమా - ఎముకలు, అవయవాలను కలిపే సంధాయక కణజాలం, కండర కణాల్లో వచ్చే క్యాన్సర్
-లుకేమియా - రక్తకణాలు, ఎముక మజ్జాలో వచ్చే క్యాన్సర్
-లింఫోమా, మైలోమా - రోగ నిరోధక వ్యవస్థలోని లింఫ్ నాళాలలో, లింఫ్ గ్రంథులలో వచ్చే క్యాన్సర్


వృత్తి కారణం కావచ్చు

చేసే పని వల్ల కూడా క్యాన్సర్ సోకే ప్రమాదం ఎక్కువవుతుంది కొన్ని సార్లు. శీతల దేశాల్లో ఎండ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఉండే వారికి, ఆస్బెస్టాస్, నికెల్ వంటి కెమికల్ పరిశ్రమల్లో పనిచేసే వారికి, గనుల్లో పనిచేసేవారికి, అణువిద్యుత్ కేంద్రాలలో పనిచేసే వారికి రేడియేషన్ ప్రభావం వల్ల క్యాన్సర్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది.

క్యాన్సర్‌ను నిర్ధారించే పరీక్షలను అవసరాన్ని బట్టి చేస్తుంటారు. ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కాన్, సీటీ స్కాన్, న్యూక్లియర్ స్కాన్, ఎంఆర్‌ఐ, పెట్ స్కాన్, బయాప్సీ, రక్తపరీక్షలు, మల, మూత్ర, కఫ పరీక్షలు అవసరమవుతాయి. క్యాన్సర్ నిర్ధారణ జరిగిన తర్వాత ఇతర అరోగ్య అంశాలు, వయసు ఆధారంగా ముందుగా సర్జరీ తర్వాత ఇతర థెరపీలు చెయ్యడం లేదా కొన్ని సార్లు ముందుగా కొన్ని విడతల ఇతర థెరపీల తర్వాత సర్జరీ చెయ్యడం వంటి నిర్ణయం తీసుకుంటారు. చికిత్సలో భాగంగా కీమో, రేడియో, హార్మోన్ థెరపీ, జీన్ థెరపీ, బయోలాజికల్ ఇమ్యూనో థెరపీ వంటి అనేక రకాల థెరపీలు, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ థెరపీ వంటివి అనేక కోణాల్లో సమస్యను పరీశీలించిన మీదట నిర్ణయిస్తారు.

ఈ రోజుల్లో క్యాన్సర్ కణం మీద నేరుగా ప్రభావాన్ని చూపే కీమోథెరెపీ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు రేడియేషన్‌లో విమ్యాట్ రేడియేషన్, త్రీడీ రేడియేషన్ ఎక్స్‌రేలతోనే కాకుండా ప్రోటాన్ థెరపీ, రేడియేషన్‌లో కలిగే దుష్ప్రభావాలను తగ్గించే బ్రాకీ థెరపీ వంటి అత్యాధునిక రేడియేషన్ విధానాలు అందుబాటులోకి వచ్చాయి. హార్మోన్‌ల మీద పనిచేసే హార్మోన్ థెరపీ, నిరోధక శక్తిని పెంపొందించే ఇమ్యూనో థెరపీ, వీటితో పాటు ధ్యానం, యోగా, మంచి ఆహారం, కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి. ఈ చికిత్సలన్నింటిలో కలిగే దుష్ప్రభావాల ప్రభావం ఒకోక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది.

కారణమేమిటో..?

క్యాన్సర్ రావడానికి కచ్చితమైన కారణం తెలియదు. కానీ త్వరగా గుర్తించగలిగితే పూర్తిగా తగ్గించడం సాధ్యమే. ఆరోగ్యవంతమైన జీవన శైలి, ఆల్కహాల్, స్మోకింగ్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండడం, పీచు పదార్థాలు ఎక్కువగా కలిగిన ఆహారం తీసుకోవడం, ఒత్తిడి లేకుండా ఉండేందుకు ప్రయత్నించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంత వరకు క్యాన్సర్‌ను నివారించ వచ్చు. మళ్లీ మళ్లీ మరగకాచిన నూనె వాడడం, వంటింటి పొగలు బయటకు వెళ్లకుండా అక్కడే తిరుగుతుండడం వల్ల రకరకాల క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉంటుంది.
vamshi
కేవలం తొలి దశలో గుర్తించగలిగినపుడు మాత్రమే క్యాన్సర్‌ను పూర్తిగా తగ్గించడం సాధ్య పడుతుంది. ఏవైద్య విధానంలోనూ ముదిరిపోయిన క్యాన్సర్‌ను పూర్తిగా తగ్గించే మందులు అందుబాటులో లేవన్న నిజాన్ని అందరూ తెలుసుకోవాలి. క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత ఆరోగ్యవంతమైన జీవన శైలిని అనుసరించడం, పాజిటివ్ దృక్పథం కలిగి ఉండడం, సమతుల ఆహారం తీసుకోవడం వంటి వన్నీ క్యాన్సర్ చికిత్సకు తోడ్పాటునందిస్తాయి.

క్యాన్సర్ కణం ఒకొక్కరిలో ఒక్కో విధమైన ప్రభావాన్ని చూపుతుంది. దాన్ని అనుసరించి చికిత్స ఆధారపడి ఉంటుంది. కీమో అయినా రేడియేషన్ అయినా కొందరిలో ఎక్కువ విడతలు అవసరమవుతుంది. మరి కొందరిలో ఒకటి రెండు విడతలకే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కొంత మందికి సంవత్సరాల తరబడి చికిత్స అవసరం కావచ్చు కూడా.

1119
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles