
ఈ చిత్రంలో కనిపిస్తున్న చిత్రాన్ని ఓ చిన్నారి తన స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్‌గా చేసింది. ఏ భాషలో చెప్పినా మీటూ అనేది విశ్వవ్యాప్తంగా ఉన్న సమస్య. ఆ చిత్రంలో కనిపిస్తున్న కళ్లు నావే. నేను ఆ చిన్నారితో మాట్లాడాను. మీటూ సమస్య మీద నేను మాట్లాడినందుకు డబ్బింగ్ యూనియన్ నుంచి నాపై నిషేధం ప్రకటించారు. అయినా సరే నేను ప్రశ్నించడం ఆపను.

చిన్మయి శ్రీపాద@Chinmayi
చిన్మయిని ట్విట్టర్లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 9,99,689
కామన్‌మ్యాన్ వాయిస్
జోకులు ఎదుటివాళ్ల మీద వేస్తే బాగా ఎంజాయ్ చేస్తాం. అవే జోకులు మన మీద వేస్తే తట్టుకోలేం మరి. ఇది ఎవరూ కాదనలేని నిజం.
-Vanaja Srinivas
ఎన్టీఆర్ సినిమా విజయాలలో తోడుగా ఉన్న కాంతారావుని బయోపిక్‌లో లేకుండా చేశారు. పాపం ఆయన తెలంగాణ వాడు కావడమే ఆయన దురదృష్టం.
- Venkat Boodida
నాదెండ్ల లీక్స్‌పై పచ్చ చానెల్స్ ఎందుకు డిబెట్స్ పెట్టడం లేదు. మేధావులు ఎక్కడున్నారు?
-Ram Jonnalagadda
వైరల్ వీడియో
రంగుల పుట్టిల్లూ.. తెలుగూ లోగిళ్లూ, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లూ అంటూ మంగ్లీ పాడిన సంక్రాంతి పాట యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నది. మైక్‌టీవీ ద్వారా విడుదలైన ఈ పాటను ఎక్కువ మంది చూస్తున్నారు.
Sankranthi Song 2019 || Mangli || Hanmanth Yadav || Mittapalli Surendar || Full Song || Mictv || HD
Total views : 433,443+
Published on Jan 11, 2019