శరణాగతి పొందడమెలా?


Sun,January 6, 2019 01:41 AM

ఉదయ సమయంలో తమ వల్ల జరిగిన దోషాలు పోవాలని, రాత్రి నుంచి ఉదయం వరకూ జరిగిన దోషాలు నశించాలని సంధ్యావందనం చేసుకునే వారందరూ భగవంతుణ్ణి వేడుకొంటారని చిన జీయర్ స్వామి చెప్పారు. మన ప్రమేయం లేకుండా జరిగిన తప్పులకే ఇది వర్తిస్తుందని, తెలిసి చేస్తే మాత్రం దాని ప్రతిఫలం అనుభవించాల్సిందేనని, అలాంటి విషయాల్లో భగవంతుడు సాయపడడని ఆయన అన్నారు. అయితే, ప్రతి రోజూ భగవంతుణ్ణి అందరూ తాము చేసిన తప్పులను మన్నించమని వేడుకోవడం వల్ల కొంతమేర భారం తగ్గుతుందని స్వామి వారు తెలిపారు.
Chinna
ధనుర్మాస మహోత్సవాలకు హైదరాబాద్ నగరం వేదికైంది. జూబ్లీ హిల్స్‌కు చెందిన నందగిరి హిల్స్‌లోని మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు నివాసంలో ఈ ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 16న ప్రారంభమైన ధనుర్మాసోత్సవాలు శనివారంతో 21వ రోజుకు చేరుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఏ విధంగా ఆచరించింది, ఆ తల్లి చేసిన ప్రక్రియ ద్వారా మనం ఏమేమి నేర్చుకోవాలి అనే అంశాలను వివరించారు. భక్తులందరూ స్వామి వారు చెప్పిన ప్రవచనాలను శ్రద్ధగా ఆలకించారు. కార్యక్రమంలో రామేశ్వరరావుతోపాటు ఆయన సతీమణి శ్రీకుమారి, వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ధనుర్మాస వ్రతంలో రెండు భాగాలు పూర్తి చేసుకుని, మూడోభాగం చివరకు చేరుకున్నామని, దైవం ఎలా ఉంటుంది? ఎలా ఆరాధించాలి? అలా ఆరాధించాలంటే ఏం చేయాలి ? అనే అంశాలు మొదటి ఐదు పాటల్లో గోదాదేవి తెలిపింది. దైవాన్ని ఆరాధించాలంటే దానిని దర్శింపచేసే మహనీయుల ఉపదేశం కావాలి. దీన్నే భాగవత సహవాసం అంటామని స్వామి వారు పేర్కొన్నారు. భాగవత సహవాసాన్ని రెండు భాగాలు చేసి అందులో మొదటి ఐదింటితో ఎలా వినాలి? విన్న దానిని ఎలా భావించాలి? భావించిన దానిని దర్శన సమానాకారంలా ఏ విధంగా చేసుకోవాలో మరొక ఐదింటిలో చెప్పింది. భగవత్ తత్తాన్ని శ్రవణము, మననము చేయాలి. ఇవి చేసేటప్పుడు మనలో కలుగవలసిన లక్షణాలేమిటి? వీటిని ఐదు పాశురాల్లో తెలిపింది ఆండాళ్ తల్లి.

తర్వాతి ఐదు పాశురాల్లో భగవంతుణ్ణి చేరడానికి పెద్దలు చూపే మార్గాన్ని ఉపదేశించే ఆచార్యుడు, పఠించవలసిన మంత్రము? ఆ మంత్రం వివరణ? మన తరపున భగవంతునికి చెప్పి, ఆ భగవంతుణ్ణి మనవైపు ప్రసన్నుడిని చేసే విధానం గురించి మరో ఐదు పాటల్లో గోదాదేవి చెప్పింది. ఇంకో ఐదు పాశురాల్లో భగవంతుణ్ణి శరణాగతి చేయడం ఎలా అనేది గోదా తల్లి మనకు వివరిస్తుందని, 21 దగ్గర నుంచి 25 వరకు ఉపాసన చేసే ఉద్దేశాన్ని తెలియజెప్పడమే ఆండాళ్ తల్లి తాత్పర్యమని, దాన్నే అందంగా శ్రీకృష్ణకథలో పెట్టి మనకు వర్ణించే ప్రయత్నం చేసిందన్నారు స్వామి వారు. భగవత్ తత్వాన్ని శరణాగతి చేసిన తదుపరి ఆయన దగ్గర విన్నవించాల్సిన లక్ష్యాన్ని గురించి చెప్పడమే చివరి ఐదు పాశురాల తాత్పర్యమని చిన జీయర్ స్వామి వెల్లడించారు.
అందులో భగవంతుడి దగ్గర మనం చేసే శరణాగతి ఎలా ఉండాలి? భగవంతుణ్ణి తెలియజేయడానికి ఆచార్యులు మూడు మంత్రాలను ఉపదేశిస్తారు. వాటిలో తిరుమంత్రం, ద్వయ మంత్రం, చరమ శ్లోకం అని మూడు మంత్రాలున్నాయని, తిరుమంత్రం గురించి ఆండాళ్ తల్లి అంబరమే అనే పాశురం ద్వారా, ఉందుమదగళిత్త అనే పాశురంలో ద్వయ మంత్రాన్ని గురించి అమ్మ తెలియ జెప్పిందని చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. స్వతంత్రంగా ఒక అర్థాన్ని చెప్పగలిగేవన్నిటినీ పదాలు అంటారు. అవి ఏక అక్షరంగా గానీ, కొన్ని అక్షరాలను పదము అనీ అంటాం. అర్థవంతమైన శబ్దాన్ని అక్షరంగా భావిస్తామని స్వామి వారు వివరించారు. వాక్యము అంటే పరస్పరం ఏర్పడే ప్రశ్నలకు ఒకదాని కొకటి సమాధానాన్ని అందించుకుంటూ ఒక కూర్పులో ఉండే కొన్ని పదముల సముదాయాన్నే వాక్యం అంటారని ఆయన తెలిపారు.

చెడు అంతా మనసులోనే!

Chinna1
ఓం కారంలో అ, ఉ, మ అనే అక్షరాలున్నాయని, స్వతంత్రంగా ఒక అర్థాన్నిచ్చే పదమే కాకుండా, వాక్యంగా కూడా దీనిని చెప్పవచ్చని ఆయన అన్నారు. ఓం కారమంటే ఏమిటి అనే దానికి వేదాలలో ఋషులు వివరణ ఇచ్చారని స్వామి వారు పేర్కొన్నారు. భగవద్గీతలోని 8వ అధ్యాయంలో ఓం కారాన్ని ఒక అక్షరంగా చూసినప్పుడు బ్రహ్మ అని, అప్పుడు వేదంలోని సారమవుతుందని, మాంమ్ అనుస్మరణ నన్ను చెబుతుంది. కనుక నన్ను అంటే భగవంతుడని అర్థమని ఆయన వివరించారు. ప్రపంచం గానీ, ప్రపంచంలో ఉన్నవి కానీ చెడ్డవి కావు, చెడంతా మనసులోనే ఉంటుందని చెబుతూ ముందు దాన్ని శుభ్రం చేస్తే సృష్టి అద్భుతంగా కనిపిస్తుందని చిన జీయర్ స్వామి చెప్పారు. ప్రపంచ మనుగడకు కారణమేది అనే దాని గురించి చెప్పే ప్రయత్నం కూడా గోదాదేవి చేసిందని స్వామివారు వివరించారు.

పసుపులేటి వెంకటేశ్వరరావు

1170
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles