మరో శిఖరమెక్కిన అరుణిమ!


Sun,January 6, 2019 12:30 AM

కావాల్సినంత గుర్తింపు వచ్చిన తర్వాత చాలామంది ఆగిపోతారు. ఇక చాల్లే అనుకుంటారు. కానీ.. కొందరు మాత్రం మరో విజయం కోసం అగ్నిపర్వతంలా రగులుతూనే ఉంటారు. ఆ కోవకు చెందినదే అరుణిమ సిన్హా. ఖండాలు దాటి, శిఖరాలు అధిరోహించి మరో రికార్డు సృష్టించింది.
arunima
ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన మొదటి దివ్యాంగురాలిగా 2013లో రికార్డు సృష్టించి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది అరుణిమ. ఇప్పుడు మరో శిఖరం అధిరోహించి సరికొత్త రికార్డు తన పేరిట రాసుకున్నది. అంటార్కిటికాలోని అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ విన్సన్‌ను అధిరోహించింది అరుణిమ. 4897 మీటర్ల ఎత్తున్న ఈ శిఖరంపైకి మైనస్ జీరో డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఎక్కి మువ్వన్నెల జెండా ఎగురవేసింది. తన వైకల్యాన్ని ధిక్కరించి ఆత్మవిశ్వాసంతో శిఖరం అంచులకు చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ జిల్లాలో జన్మించిన అరుణిమ జాతీయస్థాయిలో ఫుట్‌బాల్, వాలీబాల్ క్రీడాకారిణి. అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న క్రమంలో ఓ ప్రమాదంలో కాలును కోల్పోయింది. ఆ ప్రమాదం ఆమెను ఆటకు దూరం చేసింది. కానీ ఆమె మనసు మాత్రం ఏదో చేయాలనే తహతహలాడేది. దేశం నా గురించి చర్చించుకోవాలి అని ఆలోచించింది. అంతే ఎవరెస్ట్ పర్వతాధిరోహణ గురించి తెలుసుకున్నది. అప్పటి వరకు వైకల్యంతో బాధపడుతున్న ఎవరూ ఎవరెస్ట్ ఎక్కలేదని తెలుసుకున్నది. అంతే.. తొలిసారి ఎవరెస్ట్ ఎక్కిన మహిళ అయిన బిచేంద్రిపాల్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నది. ఏడాది కాలం పాటు కఠిన శిక్షణ తర్వాత ఎవరెస్ట్ ఎక్కి రికార్డు సృష్టించింది. మళ్లీ ఇప్పుడు మౌంట్ విన్సన్ పర్వతం ఎక్కి దేశ ఖ్యాతిని మరోసారి ఖండాలు దాటించింది.

732
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles