చెరుకురసంతో ఆరోగ్యం


Tue,March 13, 2018 01:55 AM

houstonholicopy
వేసవికాలంలో చెరుకు రసం తాగితే శరీరానికి గ్లూకోజ్ ఇచ్చినట్టే..వేసవి కాలంలో దీన్ని తాగడం వల్ల అలసట పోవడమే కాకుండా జీర్ణశక్తి మెరుగవుతుంది. ఈ రసంలో కొంచెం అల్లం నిమ్మరసం కలుపుకొని తాగితే.. రక్త హీనతని దూరం చేస్తుంది. అలసట వల్ల వచ్చే ఆయాసాన్ని కూడా దూరం చేస్తుంది. దీనిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, పాస్పరస్ కాల్షియం శరీరాన్ని ఎప్పటికప్పుడు ఉత్తేజంగా ఉంచుతాయి. రసంలో సుక్రోజ్ రూపంలో ఉండే చక్కెరని శరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది. శరీరం డీ హైడ్రేషన్‌కి లోనయినప్పుడు చెరుకు రసం తాగితే తక్షణ శక్తి వచ్చి త్వరగా కోలుకుంటారు. చెరుకు రసంలో ైగ్లెసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా చెరుకు రసం తాగొచ్చు. దీనిలోని సుక్రోజ్ దంత సమస్యలని కూడా నివారిస్తుంది. శరీరంలోకి క్యాన్సర్ కారకాలు రాకుండా నియంత్రించే ప్లేవనాయిడ్స్ చెరుకు రసంలో ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు విస్తరించకుండా చేయడంతో పాటు వాటితో పోరాడి నాశనం చేస్తాయి కూడా. కాలేయ వ్యాధులు, కామెర్ల నుంచి కాలేయానికి రక్షణ ఇస్తుంది..

693
Tags

More News

VIRAL NEWS