కదిలించే గ్రంథాలు


Sun,February 11, 2018 01:36 AM

ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్

Traged
హైదరాబాద్ సంస్థానపు చివరి ప్రధాని మీ ర్ లాయక్ అలీ రాసిన ఆంగ్ల రచన ఇది. 1947-48 మధ్య ఢిల్లీ-హైదరాబాద్ మధ్య నడిచిన దౌత్యం, భారత్‌లో సంస్థానం విలీనం వంటివి దీనిలో ప్రధానాంశాలు. ఈ గ్రంథంలోని ఇతివృత్తాలు, శైలి ఆకట్టుకొనేలా ఉంటాయి.

గాలీబు గీతాలు

తొలి నాళ్లలో ఉర్దూలో బలమైన కవి మీర్జా అసదుల్లాఖాన్ రాసిన గజల్స్, రుబాయిల ప్రేమైక జీవన దైన్యపు కవిత్వాన్ని మహాకవి దాశరథి తెలుగేనా అన్నంత మౌళికంగా అనువందించిన రచన ఇది. గాలీబు పూని రాసినట్టుగా ఉందని దాశరథిని విమర్శకులు సైతం పొగిడేలా చేసిన రచన.

పిరదౌసి

పద్య కవిత్వాన్ని కొత్తదారులు పట్టించిన జాషువా రచన ఇది. గజనీ మహ్మద్‌ను నమ్ముకొని జీవితాన్నే భంగం చేసుకొన్న పారసీకవి పిరదౌసీ కథ ఇది. అడుగడుగునా మేలిమి ముత్యాల్లాంటి పద్యాలు జాషువా కలం నుంచి జాలువార్చిన కావ్యమిది.

మరణం లేని మీరు

book
టి. లోబ్‌సాంగ్ రాంపా you for ever పేరిట రాసిన ఆంగ్ల గ్రంథానికి పీజీ రామ్మోహన్ చేసిన అద్భుతమైన అనువాదమిది. భౌతికమైన జీవితానికి, ఆధ్యాత్మిక లోకానికి మధ్యనున్న అనుసంధానాన్ని తిరుగులేని విధంగా నిరూపించిన గ్రంథమిది. మరణానంతర జీవితాన్ని శాస్త్రీయంగా వివరించింది.

ఏడు తరాలు

ఎలెక్స్ హేలీ రచించిన ROOTS కు సహవాసి చేసిన సంక్షిప్తానువాదం. ఏడో తరపు నీగ్రో హేలీ తన ముత్తాత మూలాలను శోధించి రాసిన అద్భుతమైన కథ ఇది. ఒళ్లు గగుర్పొడిపించేలా ఉంటుంది.
ఏనుగు నరసింహారెడ్డి
తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి, సెల్ : 89788 69183

669
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles