రెరాకు ఫిర్యాదు ఎలా?


Sat,January 13, 2018 01:30 AM

complaint
ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తోన్న రెరా చట్టం రానే వచ్చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం రెరా అథారిటీని ఏర్పాటు చేస్తూ మొన్న నిర్ణయం తీసుకుంది. అప్పిలేట్ ట్రిబ్యునల్‌కూ శ్రీకారం చుట్టింది. అయితే, రెరాకు ఎవరు ఫిర్యాదు చేయాలి? రెరాకు ఎలా ఫిర్యాదు చేయాలో చాలామందికి తెలియదు. నిజానికి, ఇదంతా కష్టమైన ప్రక్రియ కాదు. డెవలపర్ సకాలంలో ఫ్లాటును అందించకుండా దారుణంగా మోసం చేశాడని.. లేదా చెప్పిన సౌకర్యాలను అందించకుండా విసిగిస్తున్నాడని మీకు అనిపిస్తే.. వెంటనే రెరా అథారిటికీ దరఖాస్తు చేయవచ్చు. కాకపోతే, 2017 జనవరి 1 తర్వాత అనుమతి తీసుకున్న లేఅవుట్లు, అపార్టుమెంట్లు, విల్లా, వ్యక్తిగత గృహాల ప్రాజెక్టుల్లో కొన్నవారు మాత్రమే ఫిర్యాదు

చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా, మీరు ఎప్పుడో పది, పదిహేనేండ్ల క్రితం కట్టిన అపార్టుమెంట్‌లో సేవలు మెరుగ్గా లేవనో.. సౌకర్యాలు ఆశించినంత స్థాయిలో లేవనో.. ఇప్పుడు ఫిర్యాదు చేయడం వల్ల ఉపయోగం ఉందడు. ఫ్లాట్ లేదా ఇల్లు కొనుగోలు చేసి వెంటనే, సదరు నిర్మాణంలో లోపాలు కనిపిస్తే తక్షణమే కొనుగోలుదారుడు రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. అంతకంటే ముందు, కొనుగోలుదారులు తాము ఎదుర్కొన్న సమస్యను డెవలపర్ దృష్టికి తీసుకెళ్లాలి. తను పరిష్కరించకపోతే, అప్పుడు రెరాను సంప్రదించడం ఉత్తమం. అయితే, ఇందుకు సంబంధించిన పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలి. వాస్తవానికి, వినియోగదారుల ఫోరాలకు వెళితే కేసులు తేలడానికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఈలోపు మనకు నీరసం వస్తుంది. కానీ, రెరాలో అలా కాదు. కేవలం ఆస్తులకు సంబంధించిన కేసులను మాత్రమే ఇది పర్యవేక్షిస్తుంది. కొనుగోలుదారులు, డెవలపర్ల మధ్య నెలకొనే సమస్యలను పరిష్కరిస్తుంది.
qution

401
Tags

More News

VIRAL NEWS