ఆఫీస్ స్పేస్‌లోమనదే హవా


Sat,January 13, 2018 01:26 AM


దేశంలో ఇతర మెట్రో నగరాలను కాదని ఆఫీస్ స్పేస్ డిమాండ్ విషయంలో హైదరాబాద్ మొదటి స్థానాన్ని కొనసాగిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహాకర విధానాలు, తరలివస్తున్న విదేశీ కంపెనీలు, ఇక్కడి వాతావరణం, నైపుణ్యం గల విద్యార్థులు ఇవన్నీ హైదారాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు మంచి డిమాండ్‌ను కల్పిస్తున్నాయి. ఇదే విషయం నైట్ ఫ్రాంక్ దేశంలోని 8 ప్రధాన నగరాల్లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఇతర మెట్రో నగరాల్నింటిలో కంటే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం జోరు కొనసాగుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 2017 ద్వితియార్థంలో 33.4 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను పలు కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. ఇది 2016 ద్వితీయార్థంతో పోల్చుకుంటే 5 శాతం ఎక్కువ. ఆఫీస్ స్పేస్‌కు విపరీతంగా డిమాండ్ వల్ల స్థలం లభ్యం కావడం కష్టంగా మారింది.

హైదరాబాద్ అతి వేగంగా నలువైపులా విస్తరిస్తున్న నేపథ్యంలో కోరుకున్న ప్రాంతంలో ఆఫీస్ స్పేస్ కావాలంటే మునుపటి కంటే ఎక్కువ అద్దె చెల్లించాలి. ముఖ్యంగా ఉత్తరం వైపు అద్దెలు 9 శాతం పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. హైదరాబాద్ దక్షిణం వైపు అతి వేగంగా అభివృద్ధి చెందుతుందని, 2016తో పోల్చితే గతేడాది ద్వితీయార్థంలో 15 శాతం వరకు వృద్ధి నమోదైంది. క్లిష్ట సమయంలో అహ్మదాబాద్, హైదరాబాద్‌లు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అయితే కావల్సినన్ని గృహాలు ఇక్కడి మార్కెట్‌లో అందుబాటులో లేకపోవటం అనేది సమస్యగా మారుతున్నది. దీంతో ఇతర నగరాలతో పోల్చితే అద్దెలు పెరుగుతున్నాయని పేర్కొంది.

408
Tags

More News

VIRAL NEWS