పొడుగైనా అందమే!


Fri,January 18, 2019 01:48 AM

చీరలు.. చుడీదార్లు.. లెహంగాలు.. గౌన్లు.. ఒక్కొక్కప్పుడు ఒక్కో ఫ్యాషన్ నడుస్తుంది.. సీజన్‌ని బట్టే కాదు.. అకేషన్‌ని బట్టి కూడా ఇవి మారుతుంటాయి.. కానీ అన్ని సీజన్లలో.. అన్ని అకేషన్లకి తగ్గట్టు.. లాంగ్‌ఫ్రాక్‌లదే ఇప్పుడు హవా కొనసాగుతున్నది.. పొట్టిగా కాదు.. పొడుగుగా ఉంటేనే అందమంటున్నారు మగువలు.. అందుకే చూడముచ్చటైన ఆ లాంగ్‌ఫ్రాక్‌ల సోయగాలు మీ కోసం..
Fashan
1. వైన్ పింక్ కలర్ అనార్కలీ మోడల్ లాంగ్ డ్రెస్ వేసుకుంటే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే! ఆర్గంజా ఫ్యాబ్రిక్‌తో కుట్టిన ఈ డ్రెస్‌కి పైన ఒక వైపు మాత్రమే హైలైట్ చేశాం. ఫుల్‌గా జర్దోసీ వర్క్‌తో నింపేశాం. స్లీవ్స్ మీద మాత్రం సింపుల్ జర్దోసీ వర్క్ ఇచ్చేసరికి చూడముచ్చటగా కనిపిస్తున్నది.


2. పీచ్ అండ్ పింక్ కాంబినేషన్‌లో కుట్టిన డ్రెస్ ఇది. శిబోరీ లాంగ్ ఫ్రాక్‌కి సరిగ్గా సరిపోయేలా మధ్యలో పింక్ కలర్ రాసిల్క్ బెల్ట్‌ని ఇచ్చాం. దీని మీద ఫుల్‌గా సీక్వెన్స్ వర్క్ ఇచ్చాం. సీతాకోక చిలుక రెక్కలా స్లీవ్స్ ఇచ్చి దీని మీద కూడా ఫుల్‌గా
వర్క్ చేశాం. ఈ స్లీవ్స్ ఈ డ్రెస్‌కి అదనపు ఆకర్షణ.

3. హ్యాండ్‌లూమ్ ఎప్పటికీ ఎవర్‌గ్రీనే! లేత ఆకుపచ్చ రంగు డ్రెస్‌ని లాంగ్ అనార్కలీ మోడల్‌లో డిజైన్ చేశాం. దీనికి పైన కలర్ సీక్వెన్స్, జర్దోసీ వర్క్‌తో పువ్వుల డిజైన్ కుట్టాం. స్లీవ్స్ మీద మాత్రం సింపుల్‌గా జర్దోసీ వర్క్‌తో నింపేయడంతో సూపర్‌గా ఉన్నది.
Fashan1
4. పార్టీల్లో ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ డ్రెస్ మీకు పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. ఆకుపచ్చని ఫ్లోయి కాటన్‌ని బోట్ నెక్‌తో కుట్టాం. కింద అసమెట్రికల్ డిజైన్ ఇచ్చాం. పైన, స్లీవ్స్ మీద మాత్రం జర్దోసీ, స్టోన్స్‌తో వర్క్ చేసేసరికి మరింత ఎలిగెంట్‌గా కనిపిస్తున్నది.

5. సింపుల్ అండ్ స్వీట్‌గా మెరిసిపోవాలంటే ఈ డ్రెస్ వేయాల్సిందే! ఆనియన్ కలర్ క్రేప్‌ని లాంగ్ గౌన్‌గా డిజైన్ చేశాం. కింద ఎక్కువ కుచ్చుల్లా వచ్చేలా దీన్ని కుట్టాం. దీనికి పైన ఫుల్‌గా హ్యాండ్ వర్క్ చేయించాం. స్లీవ్స్‌ని మాత్రం సీతాకోక చిలుక రెక్కల్లా డిజైన్ చేశాం. పింక్ కలర్ క్రేప్ మీద ఫుల్‌గా వర్క్ ఇవ్వడంతో మరింత మెరిసిపోతున్నది.

హారికారావు
ఫ్యాషన్ డిజైనర్
హారికా స్టూడియో
పద్మనాభ నగర్, హైదరాబాద్
ఫోన్: 8179593237
వెబ్ : www.harikastudio.in

835
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles