విధి కలిపిన బిడ్డలు!


Fri,January 18, 2019 01:45 AM

ఇదో విచిత్ర సంఘటన. విధి కలిపిన పేగుబంధం. సినిమా కథను తలపించే ఈ సంఘటన అమెరికాలో జరిగింది. ఓ తల్లి మానవత్వం ఇద్దరు చిన్నారులను ఒకేచోటికి చేర్చింది. ఆ యాదృశ్చికమైన సంఘటన ఏంటో తెలుసా?
Adopt-Kids
ఈమె పేరు కాటీ పేజ్. అమెరికాలోని కొలొరాడోలో ఉంటుంది. 30 యేండ్ల ఈవిడ భర్తతో విడాకులు తీసుకుంది. అయితే ఈమెకు పిల్లలు లేరు. 11 నెలల క్రితం ఓ బాబును దత్తత తీసుకుంది. అతనికి గ్యారీసన్ అని పేరు పెట్టింది. ఆ తర్వాత మరో బేబీని దత్తత తీసుకొని ఇద్దరినీ సొంతబిడ్డల్లా చూసుకుంటుంది. అయితే.. రెండు వారాల క్రితం ఆమెకు ఓ అనాథ శరణాలయం నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఆడపిల్లను దత్తత తీసుకుంటావా? అనేది దాని సారాంశం. నలుగురి బిడ్డలను దత్తత తీసుకోవాలని ఆశతో ఉన్న కాటీ పేజ్.. సరేనని సమాధానం ఇచ్చింది. అక్కడికి వెళ్లి.. ఆ పాపను దత్తత తీసుకొని హన్నా అని పేరు పెట్టింది. అయితే, చట్టబద్ధంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల కోసం కన్నతల్లి ఎవరనేది ఆరా తీయడం మొదలు పెట్టింది కాటీ. అప్పుడే గ్యారీసన్, హన్నా తల్లి ఒక్కరే అని గుర్తించింది. వెంటనే కన్నతల్లి చిరునామా వెతికి.. ఆమెను కలుసుకున్నది కాటీ పేజ్. ఆమె కన్న బిడ్డలిద్దరూ తన దగ్గర క్షేమంగా ఉన్నారని చెప్పింది. ఆ వార్త విని కన్నతల్లి చాలా సంతోషించింది. అయితే ముచ్చటగా మూడో బిడ్డను కూడా కనివ్వాలని కోరింది కాటీ పేజ్. ఈ విషయాన్ని, పిల్లల ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది కాటీ. విధి కలిపిన ఈ చిన్నారులను సోషల్ మీడియా వేదికగా పలువురు దీవిస్తున్నారు.

664
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles