శిరోజాల సంరక్షణకు..


Fri,January 18, 2019 01:41 AM

చలికాలం వచ్చిందంటే జుట్టు చిట్లిపోవడం, రాలిపోవడం ఎక్కువ అవుతుంటుంది. ఈ సమస్య పరిష్కారానికి సరైన చిట్కాలు పాటించాలి.
haircare
-ఒక కప్పు స్ట్రాబెరీలను జ్యూస్ చేసి అందులో గుడ్డు పచ్చసొన, ఆలివ్ ఆయిల్‌ని కలిపి తలకు రాయాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే చాలు.
-ఓట్‌మీల్, పాలు, బాదం నూనెను కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కేశాలకు పూతలాగా రాయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారానికోసారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
-ఆలుగడ్డని మెత్తని పేస్ట్‌లా చేయాలి. అందులో తేనె, నీరు కలిపి జుట్టు మొదళ్లకు రాయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య చాలావరకు తగ్గుతుంది.
-కొత్తిమీరను మెత్తగా రుబ్బి అందులో నీళ్లు కలిపి జుట్టుకు రాయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ ప్యాక్ రాయడం వల్ల చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు.
-వీటితో పాటు ఈ కాలంలో ఎక్కువసేపు నూనె పెట్టుకొని ఉండకూడదు. కండీషనర్‌ని కూడా తప్పనిసరిగా వాడినప్పుడు జుట్టు రాలకుండా ఉంటుంది.

542
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles