
-చేప ముక్కలకు ఉప్పు కలిపి డీప్ ఫ్రీజర్‌లో పెడితే ముక్కలు అంటుకోకుండా ఉంటాయి.
-స్వీట్స్‌లో చక్కెరను పొడిగా చేసి వేస్తే అవి చాలా రుచిగా ఉంటాయి.
-ఉడికించిన తర్వాత కూడా కూరగాయల రంగు కోల్పోకుండా ఉండాలంటే ఆ నీళ్లలో కొంచెం పసుపు, ఆలివ్ నూనె వేసి ఉడికించాలి.
-పసుపు కలిపిన నీటితో వంటగదిని శుభ్రం చేస్తే ఈగల బాధ ఉండదు.
-పాలు పొంగకుండా ఉండాలంటే అవి మరిగేటప్పుడు ఆ గిన్నెపై ఒక స్పూన్ పెట్టండి.