ట్రెడిషనల్.. ట్రెండీ!


Fri,January 4, 2019 12:42 AM

సంప్రదాయం ఉట్టిపడేలా.. ఒకప్పుడు పంచెలు కట్టేవారు.. ఆ స్థానంలో కుర్తా.. పైజామాలు చేరాయి.. ట్రెండీగా కావాలనుకుంటే.. జీన్స్, టీ షర్ట్‌లు వేసేవారు.. కానీ అన్ని అకేషన్లలో అవి పనికిరావు.. సూటయ్యేందుకు.. సూటు వేయాల్సిందే!
స్కూల్‌కి వెళ్లే అబ్బాయిలకు.. కాలేజ్‌కి వెళ్లే కుర్రకారుకు.. ప్రత్యేకమైన డ్రెస్సింగ్ స్టయిల్స్ మీకోసం..

Fashan
1. ఫంక్షన్లలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలువాలంటే ఇలాంటి డ్రెస్ వేయాల్సిందే! బ్లూ కలర్ లోఫర్ కట్ ప్యాంట్‌కి, ఈ టీషర్ట్ పర్‌ఫెక్ట్‌గా సరిపోయింది. కాలర్, బటన్ లైన్ బ్లూ రావడం బాగుంది. ఎర్రని జాకెట్ సూపర్ లుక్ తెచ్చింది.


2. గోల్డెన్ కుర్తా పైజామా గ్రాండ్ లుక్‌గా ఉంది. కుర్తా హై అండ్ లో డిజైన్‌తో ఆకట్టుకుంటున్నది. దీనికి బ్లాక్ కలర్ వేస్‌కోట్ గోల్డెన్ బటన్స్ పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యాయి.

3. బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్‌లో ఈ కుర్తా, పైజామా చూడముచ్చటగా ఉంది. కుర్తాకి వన్‌సైడ్ కుచ్చుల్లా రావడం వల్ల స్టయిలిష్‌గా కనిపిస్తున్నది. దీనికి లైట్ బ్లూ కలర్ వేస్‌కోట్ ఇచ్చారు. నవాబుల ప్రింట్ దీనికి అదనపు ఆకర్షణగా నిలిచింది.
Fashan1
4. కాంట్రాస్ట్ ఎప్పుడూ ఎవర్‌గ్రీనే! బ్లూ పైజామా, మల్టీ కలర్ కుర్తా పర్‌ఫెక్ట్‌గా ఉంది. దీన్ని ముందు కుచ్చులు వచ్చేట్లు, ఫుల్ స్లీవ్స్‌తో డిజైన్ చేశారు. గోల్డెన్ వేస్‌కోట్ మీద చిన్న వర్క్ మరింత మెరిసిపోతున్నది.

5. నైట్ సూట్స్ కూడా స్టయిలిష్‌గా ఉంటాయి. నల్లని ప్యాంట్‌కి తెల్లని షర్ట్ సూపర్‌గా కనిపిస్తున్నది. ఈ షర్ట్‌కి సైడ్ బటన్స్ రావడమే కాక, కాలర్ లేదు. దీంతో లుక్ మరింత అదిరిపోయింది.

716
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles