పచ్చని ఆకులతో!


Fri,January 4, 2019 12:35 AM

సాధారణంగా స్త్రీలు అందానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందం పంచుకోవడం కోసం మార్కెట్లో దొరికే క్రీములు వాడుతుంటారు. అవికాకుండా పెరట్లో దొరికే అనేక మొక్కల ద్వారా అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
skincare
-పుదీనా ఆకులను అలాగే తులసి ఆకులను నీటిలో మరిగించాలి. అందులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మ రంధ్రాలను, ముఖాన్ని శుభ్రం చేస్తుంది.
-వేపఆకులను నీటిలో మరిగించాలి. ఆ నీటితో స్నానం చేయాలి. వారానికి ఒకసారి స్నానం చేస్తే చాలు. ఇది చర్మాన్ని చల్లగా ఉంచి మొటిమలను నివారిస్తుంది. వేప చుండ్రు వంటి వాటికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.
-కరివేపాకును నీటిలో మరిగించాలి. అందులో కొంచెం పసుపు కలుపాలి. ఈ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే ముఖంపై ఉన్న నల్లమచ్చలను నివారించవచ్చు.

366
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles