సూపర్ స్టయిలే!


Thu,November 8, 2018 11:33 PM

కాలేజ్ వెళ్లే అమ్మాయిలూ.. ఆఫీసులకు వెళ్లే పడుతులూ.. రోజుకో ఫ్యాషన్‌ని ఫాలో అవ్వకపోతే.. ట్రెండ్‌సెట్టర్‌గా ఎలా మారుతారు? మీకోసమే తీరొక్క రకమైన డ్రెస్‌లతో.. ఈ వారం ఫ్యాషన్‌ని నింపేశాం.. మరి ఈ సూపర్ స్టయిల్స్‌ని ఫాలో అయిపోండి..
fashion
ఎర్రని సిల్క్ మెటీరియ్‌ని ధోతీ పైజామాలా డిజైన్ చేశారు. దీనికి సిల్క్ డిఫరెంట్ లైన్ ప్యాటర్న్ వచ్చిన దాన్ని టాప్‌గా ఎంచుకున్నారు.
నెక్ దగ్గర చిన్న బ్రోచ్ అందాన్ని రెట్టింపు చేసింది. పసుపు రంగు కాటన్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ లాంగ్ కోట్‌గా వచ్చేసరికి డిఫరెంట్ లుక్‌తో డ్రెస్ మెరిసిపోతున్నది.
fashion1
లేత రంగులను ఇష్టపడే వారికి ఇది బాగా నప్పుతుంది. పింక్ కలర్ టిష్యూ ఫ్యాబ్రిక్ చీర మిమ్మల్ని కట్టిపడేస్తుంది. దీనికి నెట్ మీద ఫుల్‌గా
వర్క్ చేయించి, హై నెక్‌తో అలరించే సరికి ఫర్‌ఫెక్ట్ లుక్‌తో రాయల్‌గా కనిపిస్తున్నది.
fashion2
రాయల్‌గా కనిపించేందుకు ఈ రాయల్ బ్లూ గౌన్ వేసుకోండి. నెట్ గౌన్‌ని కాస్త డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. నడుము దగ్గర బెల్ట్‌లా, హాఫ్ షోల్డర్
నెక్ మీద జర్దోసీ, సీక్వెన్స్ వర్క్ మెరిసిపోతున్నది. గౌను మీద కొంగులా రావడం ఈ డ్రెస్‌కి అదనపు ఆకర్షణ.
fashion3
బుట్టబొమ్మలా చూడముచ్చటగా కనిపించాలంటే ఈ గౌన్ వేయాల్సిందే! ఎర్రని బెనారస్ పట్టు మెటీరియల్ మీద పువ్వులు, నెమళ్లు మరింత అందాన్ని
తెచ్చి పెట్టాయి. దీనికి సీక్వెన్స్ బార్డర్ పర్‌ఫెక్ట్‌గా సరిపోయింది. నెట్ ఫ్యాబ్రిక్ మీద హెవీ వర్క్ మరింత రిచ్ లుక్‌ని తెచ్చిపెట్టింది.
fashion4
గోల్డెన్ టిష్యూతో లాంగ్ టాప్ ఇది. దీని మీద కోట్‌లాగా.. డిఫరెంట్ ఫ్యాబ్రిక్‌లను ఎంచుకున్నారు. ఆరెంజ్, యెల్లో, మల్టీకలర్‌లో వచ్చిన సిల్క్ మెటీరియల్స్‌ని
కోట్‌లా కుట్టేసరికి డిఫరెంట్‌గా ఉంది. ఈ కోట్‌కి బార్డర్‌గా వేసిన దాని మీద కూడా హెవీగా వర్క్ రావడంతో రిచ్ లుక్ వచ్చింది.

1081
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles