విద్యా ప్రదాత!


Thu,November 8, 2018 11:30 PM

ఉత్తరాఖండ్‌లోని ప్రతియేటా డ్రాపౌట్స్ సంఖ్య పెరుగుతూనే ఉన్నది. కారణం కొండప్రాంతాలు కావడం, పాఠశాలలు దూరంగా ఉండడం. ఉన్న వాటిల్లో ఉపాధ్యాయులు లేక, బోధన సరిగా ఉండక విద్యార్థులు మధ్యలోనే చదువుకు స్వస్తి చెబుతున్నారు. అయితే, ఈ సమస్యకు ఓ పరిష్కారం కేవలం డ్రాపౌట్స్ విద్యార్థుల కోసం ఓ పాఠశాలను స్థాపించి.. వారి భవిష్యత్ కోసం అహర్నిశలు కష్టపడుతుంది విద్యా ప్రదాత.

anita
అనిత నౌటియాల్ ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్హ్‌వాల్ జిల్లాలో డ్రాపౌట్స్ విద్యార్థుల భవిష్యత్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నది. ఇందుకోసం ఆనంద వాటిక గ్రీన్ గురుకులం పేరుతో ఓ పాఠశాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ తరగతులతో సంబంధం లేకుండా బోధన ఉంటుంది. ఇది చదువు మధ్యలో ఆపేసి, మళ్లీ చదువుకోవాలనుకునే వారికి మాత్రమే. 2016 ఆగస్టులో దీనిని స్థాపించిన అనిత.. నిత్యం వందమంది బడి మానేసిన పిల్లలకు ఉచితంగా చదువు చెబుతున్నది. పిల్లలకు నాణ్యమైన, ఉపాధి చూపే విద్యనందించడమే తన లక్ష్యమని చెబుతున్నది అనిత. ఈ పాఠశాలలో విద్యార్థులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకొని చదువుకోవచ్చు. ఈ పాఠశాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే వారు వలంటీర్లుగా ఇక్కడ తరగతులు చెబుతుంటారు. సాయంత్రం 4 నుంచి 7 వరకూ, వేసవి-శీతాకాలాల్లో సాయంత్రం 4 నుంచి 5.30 వరకూ తరగతులు నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వలంటీర్లు డ్రాయింగ్, కంప్యూటర్, పెయింటింగ్, కల్చరల్, స్పోర్ట్స్‌లలో విద్యార్థులకు శిక్షణ, అవగాహన కల్పిస్తున్నారు. ఈ పాఠశాల నుంచి బయటికెళ్లిన విద్యార్థులు మంచి ప్రవర్తనతో చదువుల్లో ఉన్నతంగా రాణిస్తున్నారు.

581
Tags

More News

VIRAL NEWS