ఈ-చెత్తతో ఉత్తమ ఆలోచన!


Thu,November 8, 2018 11:28 PM

టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఈ-వేస్టేజ్ పెరిగిపోతున్నది. అయితే, వ్యర్థంగా పోతున్నవాటితో ఏదైనా మంచి చెయ్యాలనుకున్నారు ఈ టీనేజర్స్. ఇళ్లలో ఈ-వేస్టేజ్‌ను అమ్మి.. వేలాది మంది పేద విద్యార్థుల చదువుకు భరోసా కల్పిస్తున్నారు.

Mumbai-Teens
ముంబైకి చెందిన త్రిషా భట్టాచార్య, సూర్య బాల సుబ్రమణ్యన్ గోరేగాన్‌లోని విబ్‌గ్యోర్ స్కూల్‌లో చదువుతున్నారు. పాఠశాల తరఫున పాన్ ఇండియా పోటీల్లో భాగంగా.. వారికి ఈ-వేస్టేజ్‌తో ఏదైనా చెయ్యాలనే ఆలోచన వచ్చింది. ఇద్దరూ ఈ విషయంపై తీవ్రంగా చర్చించి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయలు సలహాలు తీసుకొని ఈ-వేస్టేజ్‌ను సేకరించి.. దానిని అమ్మి, వచ్చిన డబ్బులతో పేద విద్యార్థులను చదివించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు స్నేహితుల సహాయంతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, అన్ని పాఠశాలలకు తిరుగుతూ పిల్లలకు తమ ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని చెప్పారు. ఆయా పాఠశాలలు విద్యార్థులు స్పందించి.. తమ ఇళ్లలోని ఈ-వేస్టేజ్‌ను చాలా ఉత్సాహంగా సేకరించి త్రిష బృందానికి అప్పగించారు. ఇలా దాదాపు 180 కేజీల చెత్తను సేకరించి, ఈ-వేస్టేజ్‌ను రీసైక్లింగ్ చేసే కంపెనీకి అమ్మేశారు. అలా వచ్చిన డబ్బులతో ముంబై మురికివాడల్లోని పేద విద్యార్థుల చదువుకు ఉపయోగిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ దాదాపు 17వేల మంది విద్యార్థుల చదువుకు తోడ్పాటునందించారు. అయితే పోటీలు ముగిసిన తర్వాత కూడా త్రిష, సూర్య ఈ-వేస్టేజ్‌ను సేకరిస్తూనే ఉన్నారు. ఈ ఆలోచనతో ఎంతోమంది విద్యార్థులకు సహాయం చెయ్యగలిగాం.. దీనిని భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని త్రిష, సూర్య చెబుతున్నారు. టీనేజ్‌లోనే వీరు చేస్తున్న మంచి పనిని పలువురు అభినందిస్తున్నారు.

521
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles