దీపావళి తరువాత


Thu,November 8, 2018 11:27 PM

దీపావళి పండుగ లక్ష్మీ పూజతో మొదలై ముగ్గులు, దీపాలు, లైట్లు, టపాకులు పేల్చడంతో ముగుస్తుంది. గ్రాండ్‌గా జరుపుకున్న పండుగ అవ్వగానే ఇల్లు కాస్త పీకి పందిరేసినట్లుగా మారుతుంది. దీపావళి తర్వాత ఇంటిని శుభ్రపరుచడానికి ఈ చిట్కాలు మీ కోసం.

deepavali
-ఇంటిముందు వేసిన ముగ్గును తీసేయ్యాలి. అలంకరణకు ఉపయోగించిన ఆకులు, పూలు, పేపర్లను తొలగించాలి. అన్నీ తీసేసిన తరువాత తడి బట్టతో ఇంటిని శుభ్రంగా తుడువాలి.
-ఇంట్లో శుభ్రం చేయాల్సిన ముఖ్యమైన ప్రదేశం వంటగది. పండుగ రోజు వంటగది వైరైటీస్‌తో నిండిపోతుంది. పాత్రలన్నింటినీ శుభ్రంగా కడుగాలి. ఎక్కడ ఉన్న వస్తువులను తిరిగి అక్కడికే చేర్చాలి. అప్పుడు ఇల్లు కొత్తగా కనిపిస్తుంది.
-లక్ష్మీపూజకి తయారవ్వడానికి కొత్త బట్టలు, ఆభరణాలు, మేకప్ వస్తువులు అన్నీ చిందరవందరగా పీకిపడేసుంటారు. దీపావళి తరువాత బట్టలు ఉతికి ఆరబెట్టడం మంచిది. ఆభరణాలన్నింటినీ తీసి సర్దుకోవాలి.
-పండుగ సందర్భంగా ఫర్నీచర్, వస్తువులు మీద దుమ్ము, ధూళి అంటుకుని ఉంటుంది. దీపావళి తరువాత కాటన్ బట్టతో టేబుల్స్, ఫ్యాన్స్, ఫర్నిచర్‌ను శుభ్రం చేసుకోవాలి.
-దీపావళి తరువాత బెడ్ షీట్స్, బెడ్ కవర్స్, కర్టెన్స్, సోఫా కవర్స్ మొత్తం మార్చుకోవాలి. దాంతో ఇల్లు తిరిగి కొత్తగా కనిపిస్తుంది.
-అన్నీ పనులు అయ్యాక కాటన్ బట్టను ఫినాయిల్ నీటిలో ముంచి, ఇంటిలోని అన్ని గదులను శుభ్రం చేయాలి.

466
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles